దేవి భలే మారిపోయాడే!

0ఇప్పుడున్న సంగీత దర్శకుల్లో దేవి శ్రీ ప్రసాద్ డిమాండ్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. పీక్స్ లో ఉన్న తనతో సినిమా చేయించుకోవాలి అంటే టైం తో పాటు డబ్బు కూడా బాగా ఖర్చు పెట్టుకుంటే కానీ దొరికే పరిస్థితి లేదు. ఈ ఏడాది చేసిన రంగస్థలం-భరత్ అనే నేను రెండూ టాప్ బ్లాక్ బస్టర్స్ గా మిగలడం దేవి రేంజ్ ఇప్పట్లో తగ్గేలా లేదని ఋజువు చేసింది. కాకపోతే ఆ మధ్య కొంతకాలం మాస్ సినిమాల మూసలో పడిపోయి తన ట్యూన్లు తనే కాపీ కొడుతున్నాడు అనే కామెంట్స్ తెచ్చుకున్న దేవి కొత్తగా రిఫ్రెష్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. రంగస్థలం విజయంలో సంగీతం పాత్రను చిన్నదిగా చేసి చూడలేం. ఆ వాతావరణానికి తగ్గ బీజీఎమ్ ట్యూన్స్ తో దేవి అదరగొట్టేసాడు. భరత్ అనే నేను టైటిల్ సాంగ్ చాలా కాలం మ్యూజిక్ లవర్స్ ని వెంటాడింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ కొత్త ఆల్బం సామీ స్క్వేర్ తాలూకు ఆడియో ట్రాక్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.

ఇందులో భాగంగా రిలీజైన అతి సుందరా సుమనోహరా అనే మెలోడీ బీట్ ఫ్యాన్స్ కే కాదు మ్యూజిక్ లవర్స్ కి సైతం పిచ్చగా కనెక్ట్ అవుతోంది. కారణం చాలా స్మూత్ గా అనిపించే ట్యూన్ తో పాటు తన రెగ్యులర్ ఇన్స్ ట్రుమెంటేషన్ కి భిన్నంగా కాస్త ఇళయరాజాను తలపించే డిఫరెంట్ నోట్స్ ని కంపోజ్ చేయటమే. విన్న వెంటనే ఓ సారి రిపీట్ మోడ్ లోకి వెళ్ళాలి అనిపించేలా ఉన్న ఈ పాట తో మాస్ మసాలా పోలీస్ సినిమా సామీ స్క్వేర్ మీద కొత్త రకం అంచనాలు మొదలయ్యాయి. విక్రమ్ కు జోడిగా కీర్తి సురేష్ నటించిన ఈ మూవీ సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేసే ప్లాన్ లో ఉంది యూనిట్. 15 ఏళ్ళ క్రితం వచ్చిన సామీ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ మొదటి భాగాన్ని బాలకృష్ణతో లక్ష్మి నరసింహ పేరుతో ఆ టైంలోనే రీమేక్ చేసారు కానీ ఇప్పుడు మాత్రం డబ్బింగ్ రూపంలోనే తీసుకొస్తున్నారు.