‘అత్తారింటికి దారి ’ ఆగష్టు 9న

0

Ad-moive-releaseing-on-9th-augపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సమంతా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘అత్తారింటికి దారేది ’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ ‘యు ’ సర్టిఫికెట్ ఇచ్చారు. జల్సా చిత్రం తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులకు తోడు పవన్ కళ్యాణ్ నటన తోడైతే ఆ సినిమాకు ఉండే కిక్కే వేరు.

ఇక ఈ చిత్రం విడుదల పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ముందుగా ప్రకటించిన తేది ప్రకారం ఆగష్టు 7వ తేదీన విడుదల కావాలి. కానీ తెలంగాణ విభజన నేపధ్యంలో సీమాంధ్రలో ఉద్యమాలు నడుస్తున్నందున ఈ చిత్రాన్ని రెండు రోజులకు వాయిదా వేస్తూ ఆగష్టు 9న విడుదల చేయాలని తాజాగా నిర్మాత నిర్ణయం తీసుకున్నాడు. అదే రోజు మహేష్ బాబు బర్త్ డే కావడం కూడా విశేషం. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కీలక పాత్ర పోషిస్తుడంతో ఆరోజు విడుదల చేసి మహేష్ కి బర్త్ డే కానుకగా ఇవ్వాలనే ఆరోజు విడుదల చేయడానికి సిద్ధం అయ్యారని టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమా ఆద్యంతం సరదాగా, వినోదాత్మకంగా వుందని , ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉన్నందున సినిమా భారీ కలక్షన్లు కూడా సాధిస్తుందని అంటున్నారు.  పవన్ కల్యాణ్ సరసన సమంతా, ప్రణీత కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home