ఆసక్తికరంగా సాగుతున్నవేలం

0intresting-auctionఐపీఎల్‌-2018 వేలం అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ ఆసక్తికరంగా సాగుతోంది. భారత సీనియర్‌ ఆటగాళ్లు గౌతం గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ వేలంలో నిరాశపరిచినా మనీశ్‌ పాండే, కరుణ్‌ నాయర్‌, కేఎల్‌ రాహుల్‌ మాత్రం దుమ్ము రేపారు. విదేశీ ఆటగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా మన ఆటగాళ్లు వేలంలో అత్యధిక ధరలు పలుకుతున్నారు. రూ.50లక్షల కనీస ధరతో వేలానికి వచ్చిన కరుణ్‌ నాయర్‌ను రూ.5.6కోట్లకు పంజాబ్‌ దక్కించుకుంది. గత ఏడాది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడిన కేఎల్‌ రాహుల్‌, కోల్‌కతాకు ఆడిన మనీశ్‌ పాండే కోసం గట్టి పోటీ నెలకొంది. వీరిద్దరి కోసం ప్రధానంగా పంజాబ్‌-హైదరాబాద్‌ పోటీపడ్డాయి. చివరకు రాహుల్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ.11కోట్లకు కైవసం చేసుకోగా.. మనీశ్‌ పాండేను రూ.11 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ దక్కించుకుంది. మరో ఆటగాడు కేదార్‌ జాదవ్‌ కోసం కూడా తీవ్ర పోటీ నెలకొంది. చెన్నై-హైదరాబాద్‌ కేదార్‌ను దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. చివరకు సన్‌రైజర్స్‌ వెనక్కి తగ్గడంతో అతడు చెన్నైకే దక్కాడు. గత ఏడాది కోల్‌కతాకు ఆడిన క్రిస్‌ లిన్‌ను వేలంలో రూ.9.6కోట్లకు తిరిగి ఆ జట్టే కైవసం చేసుకుంది.

* కేఎల్‌ రాహుల్‌- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ – రూ.11 కోట్లు

* కరుణ్‌ నాయర్‌‌- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌- రూ.5.6కోట్లు

* డేవిడ్‌ మిల్లర్‌ – కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ – రూ.3 కోట్లు

* అరోన్‌ ఫించ్‌ – కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ – రూ.6.2 కోట్లు

* బ్రెండన్‌ మెకల్లమ్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – రూ.3.6కోట్లు

* జేసన్‌ రాయ్‌ – దిల్లీ డేర్‌డెవిల్స్‌ – రూ.1.5 కోట్లు

* క్రిస్‌ లిన్‌ – కోల్‌కతా నైట్‌రైడర్స్‌ – రూ.9.6 కోట్లు

* మనీశ్‌ పాండే – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ – రూ. 11 కోట్లు

* క్రిస్‌ వోక్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – రూ.7.4కోట్లు

* కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ – రూ.2కోట్లు

* షేన్‌ వాట్సన్‌ – చెన్నై సూపర్‌కింగ్స్‌- రూ.4కోట్లు

* కేదార్‌ జాదవ్‌ – చెన్నై సూపర్‌ కింగ్స్‌ – రూ.7.8కోట్లు

* కాలిన్‌ డిగ్రాండ్‌హోమ్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – రూ.2.2 కోట్లు

* యూసుఫ్‌ పఠాన్‌ – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ – రూ.1.9కోట్లు

*

కాలిన్‌ మున్రో – దిల్లీ డేర్‌డెవిల్స్‌ – రూ.1.9కోట్లు

*స్టువర్ట్‌ బిన్ని – రాజస్థాన్‌ రాయల్స్‌ – రూ.50లక్షలు

* మార్కస్‌ స్టొయినిస్‌ – కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ – రూ.6.2కోట్లు

* మొయిన్‌ అలీ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – రూ.1.7 కోట్లు