మన నులక మంచం రికార్డు సృష్టిస్తోందిగా!

0మనం పెరట్లో వేసుకుని ఒకింత కునుకు తీసుకునేందుకు వాడే నులక మంచం తాజాగా రికార్డు సృష్టించింది. మనం ఫారిన్ బ్రాండ్స్ కోసం ఎగబడుతుంటే.. ఫారినర్స్ మాత్రం మన సరుకుల కోసం క్యూ కడుతున్నారు. తాజాగా ఇదే పద్ధతిలో ఎగబడిన ఫారినర్స్.. నులకమంచం కోసం క్యూ కట్టారు. నులకమంచాన్ని అక్షరాలా యాభై వేలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యారు. సపాధారణంగా మనదగ్గర ఏ 500లో చేస్తే గొప్పగా చెప్పుకొనే ఈ మంచం ఇప్పుడు రూ.50 వేలు పలికి రికార్డు సృష్టించింది.

వివరాలు చూద్దాం. సిడ్నీకి చెందిన డేనియల్ బ్లూర్ 2010లో భారతదేశానికి వచ్చినపుడు ఇక్కడ నులక మంచాన్ని చూశాడు. దాని స్ఫూర్తితో వాళ్ల దేశం వెళ్లాక ప్రత్యేకంగా కలప తాడు ఉపయోగించి వాటిని తయారుచేసి అమ్మడం ప్రారంభించాడు. వీటిని కొనడానికి ఆస్ట్రేలియన్లు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారని డేనియల్ తెలిపాడు. ఇటీవల తాను తయారు చేసిన మంచాలకు సంబంధించిన ప్రకటన పోస్టర్లను డేనియల్ సిడ్నీలోని స్టోర్ల వద్ద అంటించాడు.

ఆ ప్రకటన చూసిన ఓ భారతీయుడు దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడు ఆ ఫొటో వైరల్ గా మారింది. ఆ ప్రకటనలో నులక మంచం ఖరీదు 990 ఆస్ట్రేలియన్ డాలర్లుగా డేనియల్ పేర్కొన్నాడు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 50 వేలు. ఆ మంచం తయారీకి మాపుల్ చెట్టు కలప – మనీలా తాడు ఉపయోగించడం వల్ల అంత ధర నిర్ణయించాల్సి వచ్చిందని డేనియల్ చెప్పాడు. ఈ ప్రకటన ట్విట్టర్ లో చూసిన భారతీయులు తమ సంస్కృతిని గుర్తు చేసినందుకు గర్వపడుతూ డేనియల్కి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఏదేమైనా.. పాత రోత కాదు.. వింత అని నులక మంచం నిరూపించడం గ్రేట్ కదూ!!Australian-advert-for-50-000-Indian-charpoy-goes-viral-