నేనూ భానుమతినే అంటున్న అవంతిక

0Avanthikaమాయ అనే సినిమాతో పరిచయమైన భామ అవంతిక మిశ్రా. ఇప్పుడీమె రెండో సినిమా చేసేస్తోంది. వైశాఖం మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అవంతిక.. ఈ సినిమాలో బోలెడన్ని కమర్షియల్ హంగులు ఉంటాయని.. తన కెరీర్ లో వైశాఖం చాలా స్పెషల్ అని చెబుతోంది.

ఈ సినిమాలో అవంతిక పోషిస్తున్న పాత్ర పేరు భానుమతి కావడం విశేషం. ప్రస్తుతం ఫిదా మూవీలో భానుమతిగా మలయాళ కుట్టి సాయిపల్లవి చేయనున్న హంగామాకు టాలీవుడ్ రెడీ అవుతోంది. అవంతిక కూడా భానుమతి అనే పాత్రతోనే తన కెరీర్ టర్న్ అవుతుందని ఆశిస్తుండడం విశేషం. ‘ఈ కేరక్టర్ చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ కలిగి ఉంటుంది. అలాగే తండ్రికి బాగా చేరువ. రియల్ లైఫ్ లో కూడా నేను తండ్రికి దగ్గరగా ఉండే అమ్మాయినే’ అని చెబుతోంది అవంతిక. స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఈమె… గ్లామర్ ప్రపంచంలోకి వస్తానని అనుకోలేదట. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కూతురుగా ఎప్పుడూ అలాంటి ఆలోచన కూడా లేదట.

డైెరెక్టర్ జయ.. తన ఫోటలను చూసి కాల్ చేసి.. ఓ ఫోటో షూట్ చేసి.. ఈ పాత్రకు ఎంపిక చేశారని చెప్పింది అవంతిక. కేవలం గ్లామర్ మాత్రమే కాదని.. ఈ కేరక్టర్ కూడా తనకు తెగ నచ్చేసిందని అంటోంది. ఎమోషనల్ గా కూడా ఈ పాత్ర ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని కాన్ఫిడెంట్ గా చెబుతోంది అవంతిక.