ఈ ఏడాదే అవతార్ సీక్వెల్స్ ప్రొడక్షన్ పనులు..

0AVATAR-SEQUELSసిల్వర్‌స్క్రీన్‌పై హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ సృష్టించిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్‌లో బాక్సాపీస్ కలెక్షన్లను కొల్లగొట్టిందో మనందరికీ తెలిసిందే. ప్రేక్షకులందరినీ మరోసారి అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు, అవతార్ మూవీ సీక్వెల్స్ ప్రొడక్షన్ పనులకు అంతా సిద్దమైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అవతార్ సిరీస్‌లో అవతార్-2తోపాటు మరో మూడు సినిమాలకు ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.

లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధి జాన్ లాండౌ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. అవతార్ సీక్వెల్స్‌ కోసం నాలుగు స్క్రిప్ట్‌లు సిద్ధమయినట్లు జాన్ వెల్లడించారు. అవతార్ సీక్వెల్స్ కోసం అద్భుతమైన లోకాన్ని సృష్టించేందుకు ఇండస్ట్రీలోనే ది బెస్ట్ ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. అవతార్ సీక్వెల్స్ ప్రతీ పార్ట్‌కు ముగింపు ఉంటుంది. నాలుగు అవతార్ సినిమాలు ఆడియెన్స్‌ను పురాణ కాలంనాటి ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అవతార్ సీక్వెల్స్ 2020, 2021, 2024, 2025 సంవత్సరాల్లో విడతల వారీగా ఒక్కోటి విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2009లో సామ్ వార్తింగ్టన్, జోయే సల్దనాతోపాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో వచ్చిన అవతార్ అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా ఇప్పటికే రికార్డుల్లో ఉంది.