అవెంజర్స్ ది ఆరంభ శూరత్వమేనా?

0

విడుదలకు వారం రోజుల ముందు నుంచే కనివిని ఎరుగని స్థాయిలో హడావిడి చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ వేడి చల్లబడినట్టు కనిపిస్తోంది. ఫస్ట్ వీక్ ఎండ్ ని ఫుల్ గా దున్నేసి ఏకంగా వంద కోట్ల వసూళ్లు కళ్ళజూసిన ఈ సూపర్ హీరోస్ బిసి సెంటర్స్ లో దూకుడు తగ్గించినట్టుగా రిపోర్ట్స్ స్పష్టంగా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి ముఖ్య కేంద్రాల్లో స్పీడ్ అలాగే ఉంది కాని రెవిన్యూ పరంగా కీలక పాత్ర పోషించే చిన్న స్థాయి పట్టణాలలో వసూళ్లు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు.

ఈవెనింగ్ షోస్ ఓ మాదిరిగా పర్వాలేదు అనిపిస్తున్నా ఉదయం మ్యాట్నీలకు మాత్రం కొంత డ్రాప్ ఉన్న మాట వాస్తవం. ఈ పరిస్థితి సౌత్ లో ఎక్కువగా కనిపిస్తోంది. నార్త్ లో చూసుకుంటే ఢిల్లీ కోల్కతా ముంబై లాంటి సిటీస్ లో రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. బాహుబలి 2ని ఇండియాలో అవెంజర్స్ దాటే ఛాన్స్ లేదన్నది స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం. కనీసం రెండు లేదా మూడు వారాల పాటు భీభత్సమైన కలెక్షన్లను మెయిన్ టైన్ చేస్తే తప్ప కనీసం దాన్ని టచ్ చేసే ప్రయత్నం అయినా చేయొచ్చు. అలాంటిది నాలుగో రోజే డ్రాప్ ఉందంటే అదంతా సులువు కాదు.

దీనికి భయపడే విడుదల వాయిదా వేసుకున్న అర్జున్ సురవరం అభినేత్రి 2 లాంటి సినిమాలు రిలాక్స్ అవుతున్నాయి. కొత్త డేట్లు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి. శాండల్ వుడ్ లో 96 రీమేక్ 99ని ఈ రోజు ధైర్యం చేసి రిలీజ్ చేశారు. సో మహర్షి దగ్గరలో ఉంది కాబట్టి ఇక ఇప్పటికిప్పుడు తెలుగు సినిమాలు బరిలో దిగే ఛాన్స్ లేదు కాని మూడో వారం నుంచి మళ్ళి క్యు కట్టబోతున్నాయి
Please Read Disclaimer