సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

పోలిక సరిగా లేదన్న బాహుబలి ప్రొడ్యూసర్

0

ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేరు బాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ ఫాలో అయ్యేవారికి దాదాపుగా తెలిసే ఉంటుంది. ఇన్స్టా గ్రామ్ లో బ్యూటీలు ఎలాగైతే హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారో అదేరకంగా ఈ తరణ్ బాక్స్ ఆఫీస్ లెక్కలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రతి నిముషం షేర్ చేస్తూనే ఉంటాడు. తాజాగా ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ ఫస్ట్ వీక్ ఇండియా కలెక్షన్స్ షేర్ చేశాడు. అయితే ఆయన ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తో ‘బాహుబలి 2’ కలెక్షన్స్ పోల్చి.. రికార్డు బ్రేక్ అయింది అన్నట్టుగా ట్వీట్ చేశాడు. ‘అవెంజర్స్’ ను ఫస్ట్ ప్లేస్ లో ‘బాహుబలి 2’ సెకండ్ ప్లేస్ లో.. మరో నాలుగు హిందీ సినిమాలను కూడా లిస్టు లో ఉంచాడు.

దీంతో ‘బాహుబలి’ నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ స్పందించారు. తరణ్ ఆదర్శ్ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన శోభు “లిస్టులో ఉన్న సినిమాల విజయాన్ని.. ఘనతను తగ్గించడం నా ఉద్దేశం కాదు. కానీ ఎంతో అనుభవం ఉన్న ట్రేడ్ అనలిస్ట్ అయిన మీరు చేసిన ఈ పోలిక మాత్రం సరైనది కాదని నాకనిపిస్తోంది. బాహుబలి 2 కలెక్షన్స్ మాత్రం ఒక భాషవి(ముఖ్యంగా నార్త్ ఇండియా ).. మిగతా సినిమాలన్నీ ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన అన్నీ భాషలవి” అంటూ ట్వీట్ చేశారు.

శోభు ట్వీట్ కు నెటిజనుల నుండి భారీ మద్దతు దక్కింది. “తరణ్ ది ఇల్లాజికల్ కంపారిజన్” అని ఒకరు అంటే.. మరొకరు ‘నిజమే.. బాహుబలి 2 హిందీ వెర్షన్ మాత్రమే అన్నప్పుడు మిగతా సినిమాల హిందీ వెర్షన్లు మాత్రమే పోల్చండి అంతేకాని ‘అవెంజర్స్’ అన్నీ భాషల కలెక్షన్స్ ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. ఇక్కడ ఒక విషయం అర్థం అవుతోంది. మన టాలీవుడ్ లో జనాలు చాలా తెలివైన వారు. అందుకే బాహుబలి తో ఎందుకొచ్చిన తంటా అనే ఉద్దేశంతో ‘నాన్ బాహుబలి’ రికార్డుల సెక్షన్ మొదలుపెట్టారు. ‘బాహుబలి’ని లిస్ట్ నుంచి లేపేశారు! పాపం బాలీవుడ్ జనాలకు ఈ చిన్న లాజిక్ తెలియక ఏదో చెయ్యబోయి ఏదో అవుతోంది.
Please Read Disclaimer