చిన్నారి పెళ్లికూతురు స్లిమ్ లుక్

0చిన్నారి పెళ్లికూతురుగా దేశం మొత్తానికి తెలిసిన భామ అవికా గోర్.. టాలీవుడ్ కి ఉయ్యాలా జంపాలా మూవీతో పరిచయం అయింది. అనతి కాలంలోనే బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న ఈ బొద్దు భామ.. అంతలోనే సడెన్ గా మాయమైపోయింది.

ట్యాలెంట్.. అందం.. ఆకర్షణ.. పక్కింటి అమ్మాయి లుక్.. టీవీ సీరియల్స్ తో కోట్లాది మందికి పరిచయం.. టీనేజ్ లోనే హీరోయిన్ అయిపోయి కుర్రాళ్లకు తెగ నచ్చేసిన అందగత్తె అంత హఠాత్తుగా సినిమాలకు దూరం కావడం ఆశ్చర్యమే అయినా.. అందుకు తగిన కారణమే ఉంది. బొద్దు బ్యూటీ అనే హ్యాష్ ట్యాగ్ ఈమెకు ఏ మాత్రం నచ్చలేదు. దాన్నుంచి బయటకు వచ్చి గ్లామర్ డాల్ అనిపించేందుకు అప్పట్లోనే ఉత్సాహం చూపింది కానీ.. అమ్మడి బాడీ అందుకు సహకరించలేదు. అందుకే బోలెడంత కష్టపడిపోయి.. ఇప్పుడు విపరీతంగా చిక్కపోయి సడెన్ గా దర్శనం ఇచ్చింది అవికా గోర్.

హఠాత్తుగా చూస్తే.. ఆ ఉయ్యాల భామే ఈ అవికా గోర్ అని గుర్తు పట్టేయడం కూడా చాలా కష్టమైన విషయం. అంతగా తనను తాను మార్చేసుకుని మరీ పోజులు ఇచ్చి.. వాటిని నెట్ లో పెట్టేసింది అవికా గోర్. ఈ డ్రెసింగ్.. పోజులు చూస్తే.. అమ్మడు ఫిలిం మేకర్స్ కు ఏం చెప్పాలని అనుకుంటోందో స్పష్టంగానే అర్ధమవుతుంది. అవిక టైమ్స్ రీస్టార్ట్ అయితే మాత్రం అమ్మడిని ఆపడం కష్టమేనేమో!Avika-Gor-Slim-Look