మహేష్ సినిమాలో.. బీ.కాంలో ఫిజిక్స్

0Mahesh-new-look-in-Spyder”బీ.కాం లో ఫిజిక్స్” అనే ఒక ఫ్రేజ్ ను బాగా పాపులర్ చేసేశారు తెలుగు ప్రజలు. తెలుగుదేశం పార్టీ నేత జలీల్ ఖాన్ చెప్పిన ఈ స్టేట్మెంట్ తో సోషల్ మీడియా అంతటా కామెడీగా దద్దరిల్లింది. అందుకే సదరు ఫ్రేజ్ పై ఇప్పటికే జబర్ దస్త్ వంటి టివి షోలలో తెగ సెటైర్లు పడిపోయాయ్. దాదాపు ఇది ప్రతీ ఇంట్లోనూ ఒక వాడుక వాక్యం అయిపోయింది.

అయితే ఇప్పుడు సదరు లైన్ ను మహేష్ బాబు కొత్త సినిమా ”స్పైడర్”లో కూడా వాడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో ఏదన్నా సీన్లో బీకాంలో ఫిజిక్స్ అంటూ పంచ్ వేస్తున్నారేమో అనుకుంటే.. అలా కాదట. సినిమాలో ఒక పాటలో.. ”బీకాంలో ఫిజిక్స్ ఉండొచ్చేమో కాని.. నీ సోకుల కొలతల్లో తేడాలు ఉండవ్” అంటూ ఒక పద ప్రయోగం చేశారని తెలుస్తోంది. ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్ర్తి ఈ లైన్ రాశాడట. అయితే దీనిని ఉంచాలా వద్దా అనే ఫైనల్ డెసిషన్ మాత్రం మహేష్ బాబు కోర్టులో వేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే స్పైడర్ సినిమాను ఏప్రియల్ 11నే రిలీజ్ చేస్తారంటూ ఇప్పుడు మరో కొత్త డేట్ వినిపిస్తోంది. ఏదేమైనా కూడా మహేష్ సినిమా త్వరగా రిలీజైతే.. ఎప్పటినుండో హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కాస్త హ్యాపీ ఫీలవుతారు