తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 తొలిరోజు కలెక్షన్స్..!

0Baahubali-2-AP-TS-Collectionsదర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. బాహుబలి నెలకొల్పే కలెక్షన్ల రికార్డుని అధికమించాలంటే మరే భారతీయ చిత్రనికైనా కొన్ని ఏళ్లు పట్టే అవకాశం ఉంది. బాహుబలి 2 చిత్రం మొదటి రోజు వసూళ్లు 100 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. అంచనాలకు తగ్గట్లుగానే బాహుబలి 2 కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది.

కాగా తెలుగురాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో దాదాపు 43 కోట్ల షేర్ ని ఈ చిత్రం తొలిరోజు సాధించడం విశేషం. బాహుబలి మొదటి భాగంతో పోల్చుకుంటే ఈ కలెక్షన్లు చాలా ఎక్కువ. కాగా తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 తొలిరోజు షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఏరియా
కలెక్షన్లు
నైజాం : 9.03 కోట్లు
సీడెడ్ : 6.10 కోట్లు
 వైజాగ్ : 4.52 కోట్లు
ఈస్ట్ : 5.93 కోట్లు
వెస్ట్ : 6.08 కోట్లు
క్రిష్ణా : 2.82 కోట్లు
గుంటూరు : 6.18 కోట్లు
నెల్లూరు : 2.40 కోట్లు