7000 స్క్రీన్ లకు పైగా విడుదల అవుతున్న బాహుబలి 2

0తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన బాహుబలి పార్ట్ 1, 2 . తాజాగా చైనా లోను సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఇప్పటి వరకు చైనాలో ఏ భారతీయ చిత్రం కూడ ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలకాలేదు. అలాంటిది ‘బాహుబలి-2’ మాత్రం మే 4న భారీ ఎత్తున ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కానుంది.

చైనాలో 7000లకు పైగా స్క్రీన్స్‌ లో రిలీజ్‌ కానున్నడం విశేషం. దంగల్‌ చిత్రం 7000 వేల స్క్రీన్స్‌ మీదే రిలీజ్‌ అయితే బాహుబలి అంతకు మించి భారీ స్థాయిలో విడుదలవుతోంది. దంగల్‌ రికార్డ్‌ను చెరిపేసిన బాహుబలి 2.. 8000 స్క్రీన్‌లపై రిలీజ్‌ అయిన భజరంగీ బాయ్‌జాన్‌ రికార్డ్‌ను మాత్రం దాటలేకపోయింది.

దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ బాహుబలి 2 అన్ని భాషల్లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్ర‌భాస్‌, అనుష్క‌, రమ్య‌కృష్ణ‌, రానా, స‌త్య‌రాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ దాదాపు 1800 కోట్ల‌కి పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించబోతున్నాడు. 2019 లో ఈ మూవీ సెట్స్ పైకి రానుంది.