సుల్తాన్, దంగల్ ను అవలీలగా అధిగమించిన బాహుబలి!

0Baahubali-Prabhas‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం విడుదల కాకముందు చిత్రం భారీ రికార్డుల్ని క్రియేట్ చేయడం సాధ్యమేగాని, బాలీవుడ్ నుండి ఇప్పటి వరకు ఇండియాలోనే ఫస్ట్ ట్రీ డేస్ టాప్ గ్రాసర్లుగా ఉన్న అమీర్ ఖాన్ ‘దంగల్’, సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాల రికార్డుల్ని దాటగలదా అనే అనుమానం చాలామందిలో మొదలైంది. కొందరు చేస్తుందంటే, ఇంకొందరు కష్టమన్నారు. కానీ బాహుబలి మాత్రం చాలా సులభంగా ఆ లెక్కల్ని దాటుకొని ఇంకాస్త పై స్థాయికి వెళ్ళిపోయింది.

గతంలో అమీర్ ఖాన్ ‘దంగల్’ మొదటి మూడు రోజులకు రూ. 107. 01 కోట్ల నెట్, సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ మొదటి మూడు రోజులో రూ. 105. 53 కోట్ల నెట్ రాబట్టగా ‘బాహుబలి’ హిందీ వెర్షన్ శుక్ర, శని, ఆది వారాల్లో కలిపి రూ. 128 కోట్ల నెట్ వసూలు చేసి వాటిని అవలీలగా అధిగమించింది. దీంతో ఈ రికార్డ్ తెలుగు సినిమా పేరిట నమోదైంది. మరి ఈ భారీ రికార్డును ఏ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా బీట్ చేస్తుందో చూడాలి.