బాహుబలి 2 రివ్యూ

0Baahubali-2-The-Conclusion-Review

బాహుబలి: ది కన్‌క్లూజన్‌ కోసం యావత్ సినీ లోకం రెండేళ్లుగా ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ఒక్కమాటలో చెప్పలేం..ఓ తెలుగు చిత్రానికి ఇంతలా ఎదురుచూస్తున్నారంటే దానికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వమని చెప్పాలి.. వెండి తెర ఫై కళ్ళకు కట్టెల అద్భుతాలు సృష్టించవచ్చని బాహుబలి చిత్రం తో నిరూపించాడు. జులై 15 , 2015 న వచ్చిన బాహుబలి మొదటి పార్ట్ తెలుగు సినిమా స్థాయి ని దేశ వ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసింది..తెలుగు దర్శకుడికి హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీయగల సత్తా ఉందా అని అంత ఆశ్చర్య పోయారు..

ఇప్పుడు అదే బాహుబలి ది బిగినింగ్ కు బాహుబలి: ది కన్‌క్లూజన్‌ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..రెండేళ్లుగా జనాల్లో నానుతున్న ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్నకు సమాధానం దొరికింది..ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9 వేల థియేటర్స్ లలో రిలీజ్ అయినా తెలుగు సినిమా గా రికార్డు సృష్టిచింది..భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా బాహుబలి 2 లో రాజమౌళి ఏం చూపించాడు..? అసలు బాహుబలి ని ఎందుకు చంపాల్సి వచ్చింది .? దేవసేన ఎందుకు బందీ కావాల్సి వచ్చింది..అవంతిక కు దేవసేన కు సంబంధం ఏంటి..? చివరకు మాహిష్మతి సామ్రాజ్యానికి రాజు ఎవరవుతారు..అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం..

కథ :

‘పరమేశ్వర ఈ బిడ్డ బతకాలి’ అంటూ శివగామి డైలాగ్‌తో సినిమా మొదలవుతుంది..రాక్షస దహన కాండ కోసం వెళ్తుండగా, శివగామికి ప్రమాదం జరుగుతుంది..ఆ ప్రమాదం నుండి శివగామి ని బాహుబలి కాపాడతాడు..ఆ తర్వాత పట్టాభిషేకం జరిగేలోపు దేశ పర్యటన చేసిన రమ్మని అమరేంద్ర బాహుబలిని శివగామి ఆదేశిస్తుంది..దీంతో రాజమాత మాట మేరకు బాహుబలి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు..ఆలా చిన్న రాజ్యం అయినా కుంతలరాజ్య నికి బాహుబలి ఏమి తెలియని అమాయకుడు గా వెళ్ళతాడు..

యువరాణి దేవసేనను చూసి అమరేంద్ర బాహుబలి ప్రేమలో పడతాడు.ఈ విషయం వేగుల ద్వారా భళ్లాల, బిజ్జలదేవుడులు తెలుసుకుంటారు. ఆ తర్వాత దేవసేన గురించి తెలుసుకున్న భల్లాల..ఆమె అందానికి దాసోహం అవుతాడు..ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలి భావిస్తాడు.. అప్పుడే కథ మలుపు తిరిగే ట్విస్ట్ వస్తుంది..దాని కారణంగా రాజు కావాల్సిన బాహుబలి సేనాధిపతి అవుతాడు..భల్లాల కాస్త రాజు అవుతాడు. దేవసేన ను బాహుబలి పెళ్లి చేసుకొని సేనాధిపతిగా రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తాడు..

దేవసేన ఫై కోపం తో భల్లాల బాహుబలి ని చంపాలనుకుంటాడు.. ఈ క్రమం లో కట్టప్ప బాహుబలి ని చంపాల్సి వస్తుంది..కానీ బాహుబలి ని చంపాలని శివగామినే ఆదేశించడం కథలో అసలైన ట్విస్ట్..ఇంతకీ శివగామి ఎందుకు చంపమని ఆదేశం ఇస్తుంది..? ఆ తర్వాత బాహుబలి కొడుకును ఎందుకు కాపాడాలనుకుంటుంది..? శివుడు (బాహుబలి కుమారుడు) ఎలా భల్లాల ఫై యుద్ధం చేస్తాడు..? ఈ యుద్ధం లో భల్లాలదేవా ఎలా చనిపోతాడు అనేది మీరు తెర ఫై చూడాల్సిందే..

ప్లస్ :

ఒక్క మాటలో చెప్పాలంటే కథలో అన్ని ప్లస్లే…

* రాజమౌళి దర్శకత్వం..

* ప్రభాస్ , రానా ల నటన..

* ఏం ఏం కీరవాణి బ్యాక్ గ్రౌండ్…

* సెంథిల్ కుమార్ సినిమా ఫోటోగ్రఫి

* నిర్మాణ విలువలు

* క్లైమాక్స్

మైనస్ :

* ఇలాంటి గొప్ప చిత్రం లో మైనస్ లు పెద్దగా కనిపించవు..కాకపోతే కొంతమందికి కొన్ని సందేహాలు రావడం చాల కామన్..ఇందులో కూడా అలాంటివే కనిపించాయి..

* భల్లాలదేవ భార్య ఎవరు ?

* తమన్నా ఏమైంది… ?

* అసలు శివగామి నిజంగానే మరణించిందా.. ?

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* అమరేంద్ర బాహుబలి గా ప్రభాస్ నట విశ్వ రూపం చూపించాడు..బాహుబలి కోసం ప్రభాస్ ఏకంగా నాలుగేళ్ల పాటు సమయం కేటాయించడం అభిమానుల్లో ఎక్కడో కాస్త నిరుత్సహం కనిపించింది..కానీ సెకండ్ పార్ట్ చూసి ప్రభాస్ నిర్ణయం తప్పు కాదని అంత అనుకుంటారు. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ దాంట్లో అద్భుతమైన నటనతో అలరించాడు. ఇక భల్లాలదేవ రానా ఫస్ట్ పార్ట్ లో కన్నా ఇందులో అసలు సిసలైన విలనిజం చూపించి ఆశ్ఛర్య పరిచాడు. క్రూరత్వం, కండబలం కలిగిన బల్లాలదేవుడిగా రానా నటనకు థియేటర్స్ లలో జై జై లు పలుకుతున్నారు. కుంతల రాజ్య యువరాణిగా దేవసేన రోల్ లో అనుష్క గ్లామర్ తో ఆకట్టుకుంది..

* ఓం నమో వెంకటేశాయ , సింగం త్రీ చిత్రాల్లో అనుష్క భారీగా కనిపించడం తో బాహుబలి 2 లో అదే విధంగా కనిపిస్తుందని అంత అనుకున్నారు కానీ వారు అనుకున్నట్లు అనుష్క కనిపించలేదు..రాజమాత శివగామి గా రమ్య కృష్ణ ఫస్ట్ పార్ట్ లో కొద్దిసేపు కనిపించే అదరగొట్టింది..కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం చించేసింది. కథ కి అసలు ట్విటర్ ఈమె ఇస్తుందని ఎవ్వరు ఊహించలేదు.

* దేవసేన బావగా కుమారవర్మ(సుబ్బరాజు) రోల్ పర్వాలేదు..

* శివుడి లవర్ గా తమన్నా కనిపించింది..

* బిజ్జలదేవుడు గా నాజర్ నటన ఆకట్టుకుంది..

* ఇక కట్టప్ప…బాహుబలి 2 సినిమాకు ఇంత అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం కట్టప్ప (సత్య రాజ్ ) అని చెప్పాలి.. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్న ఇప్పటికి జనాల్లో నానుతుంది..ఈ ప్రశ్న కు జవాబు కోసమే చాల మంది సినిమాని చూడడానికి ఆసక్తి పెంచుకున్నారు..ఇక బాహుబలి ని చంపే క్రమం లో కట్టప్ప చూపించే సెంటిమెంట్ కు కన్నీరు పెట్టుకోవాల్సిందే..అంతలా బాహుబలి – కట్టప్ప మధ్య సన్నివేశాలు ఉంటాయి..సినిమా కు ప్రధాన బలం గా కట్టప్ప రోల్ నిలిచింది.

* మిగతా నటీనటుల రోల్స్ అన్ని కూడా అందర్నీ కట్టిపడేసేలా ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

* ముందుగా సినిమా ఫోటోగ్రఫి గురించి మాట్లాడుకోవాలి..సినిమా చూస్తున్నంత సేపు సెంథిల్ కెమెరా పనితనం వెండి తెర ఫై చూస్తాం..ప్రేక్షకులను కళ్ళు పక్కకు తిప్పుకోకుండా చేసాడు..ఒక్క మాటలో చెప్పాలంటే రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది..క్లైమాక్స్ లో భల్లాలదేవ , శివుడి మధ్య వచ్చే ఫైట్ లో అసలు ఎలా చిత్రీకరించాడు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది..

* ఇక గ్రాఫిక్స్ గురించి చెప్పాలంటే తెలుగు సినిమా కాదు ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది..స్క్రీన్ ఫై వచ్చే ఆ సన్నివేశాలు చూస్తుంటే నిజంగా అది గ్రాఫిక్స్ అని ఎవ్వరు అనుకోరు..ఎక్కడ కూడా గ్రాఫిక్ అనే ఫీలింగ్ కూడా రాదంటే అర్ధం చేసుకోవాలి.

* ఎమ్ ఎమ్ కీరవాణి..ఈయన మ్యూజిక్ గురించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు..బాహుబలి 1 కంటే 2 లో తన బ్యాక్ గ్రౌండ్ తో ప్రాణం పోసాడు..’దండాలయ్య..’ పాట కు కీరవాణి ఇచ్చిన సంగీతం చూసే వారి రోమాలు నిక్క పొడుచుకోవాల్సిందే..క్లైమాక్స్ లో కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు.

* ఇక ఫైట్స్ విషయానికి వస్తే పీటర్ హెయిన్ మరోసారి కుమ్మేసాడు..ఫస్ట్ పార్ట్ లో కంటే ఇందులో కొత్త ఫైట్స్ ను చూపించి ఆకట్టుకున్నాడు..క్లైమాక్స్ ఫైట్ అయితే ఎవ్వరు కూడా మరచిపోరు..ఆ ఫైట్ కోసం పీటర్ తో పాటు రానా , ప్రభాస్ లు ఎంతో కష్టపడ్డారు.

* ఇలాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించాలంటే ముందుగా గడ్స్ కావాలి..తెలుగు సినిమా చరిత్రలో ఇంత గొప్ప చిత్రం నిర్మించినందుకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి నిర్మాతలు శోబు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని లకు..నిర్మాణ విలువల ఎలా ఉన్నాయో చెప్పడం కంటే మీరు చూస్తేనే తెలుస్తుంది.

* ఇక రాజమౌళి…మన తెలుగు ఇండస్ట్రీ లో ఇతడు దొరకడం నిజంగా మన తెలుగు చిత్ర సీమా చేసుకున్న అదృష్టం..హాలీవుడ్ డైరెక్టర్ కు తలదన్నే టాలెంట్ మన తెలుగు డైరెక్టర్ కు ఉండడం గ్రేట్..ఒక్కో ఒక్కో సన్నివేశం చూస్తుంటే తెలుగు సినిమా కాదు ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అనే ఫీల్ కలుగుతుంది..ఎవ్వరు ఊహించని విధంగా కథను తెరకెక్కించడమే కాదు సినిమా చూసిన తర్వాత రెండు రోజుల పాటు అందులో నుండి బయట పడనంత గా రాజమౌళి తెరకెక్కించాడు..

* పాత్రల ఎంపిక..వారి మధ్య సన్నివేశాలు…కథ కు తగిన గ్రాఫిక్స్ , మ్యూజిక్ ఇలా అన్ని సమపాలనలో చూపించడం ఇక్క రాజమౌళి కే దక్కుతుంది. ఫస్ట్ హాఫ్ చూసే వామ్మో అనుకున్నారు..ఇక ఈ సెకండ్ పార్ట్ చూస్తే హాలీవుడ్ ప్రేక్షకులు కూడా రాజమౌళి పట్టుకుని పోతారు కావొచ్చు..ఇప్పటికే హిందీ లో రాజమౌళి తో సినిమాలు చేయాలనీ అంత అనుకుంటున్నారు..ఇప్పుడు బాహుబలి 2 ఏమయిపోతారో..

చివరిగా :

సినిమా గురించి ఒక్క మాటలో చెప్పేది కాదు..ప్రతి ఒక్క సినీ అభిమాని మాత్రమే కాదు ప్రతి తెలుగు వాడు బాహుబలి 2 ను చూడాల్సిందే.. చూసి సినిమా అంటే ఎలా కూడా ఉంటుందా అని అనుకుంటారు..తెలుగు సినిమా అంటే మూసకథలు…ఐటెం సాంగ్స్ ..హీరోస్ విలన్లను కొట్టడం..అని అంత అనుకుంటుంటారు..కానీ తెలుగు సినిమా అంటే ఓ అద్భుతం…కలెక్షన్ల సునామీని సృష్టించగల కథలు..హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా సినిమా తీయగల వారు ఉన్నారని బాహుబలి 2 తో మరోసారి నిరూపితం అయ్యింది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క ఇండియన్ జై బాహుబలి అనాల్సిందే..

 

*****

హాలీవుడ్ లో అద్భుతంగా రూపొందిన చిత్రాలకు దీటుగా బాహుబలి రూపొందింది. వీఎఫ్ఎక్స్, సౌండ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ప్రధానంగా బాహుబలి2 స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. మైండ్ బ్లోయింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రభాస్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. రానా, అనుష్క, తమన్నా యాక్టింగ్ ఫెంటాస్టిక్. సత్యరాజ్ నటన అమోఘం అని ఉమేర్ తన బ్లాగ్‌లో రివ్యూ రాశారు.

మిడిల్ ఈస్ట్ సెన్సార్ కార్యాలయంలో బాహుబలి2 ప్రదర్శింపబడుతుంది. ఇదిగో మీకోసం లైవ్ అప్ డేట్స్

బాహుబలి ఫస్టాఫ్ ముగిసింది. సినిమా కన్నుల పండువగా ఉంది. టెర్రిఫిక్. ఒక్క సీన్ కూడా వృథాగా లేదు. హ్యాట్సాఫ్ టూ ప్రభాస్.

బాహుబలి2 సెకండాఫ్ కూడా ముగిసింది. ఇప్పటివరకు భారత్‌లో నిర్మితమైన అద్భుతమైన చిత్రాల్లో బాహుబలి ఒకటి. శుక్రవారం భారతీయ సినిమా చరిత్ర తిరుగరాయడం తథ్యం. బాహుబలి అల్ టైమ్ బ్లాక్ బస్టర్

యూఏీ సెన్సార్ బోర్డులో వేసిన ప్రీమియర్‌లో బాహుబలి2 స్టాండింగ్ ఓవేషన్. భారత సినీ పరిశ్రమకు సంబంధించిన గర్వించే క్షణాలు అవి. జై హింద్

థ్యాంక్యూ ఎస్ఎస్ రాజమౌళి. భారతీయ సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇండియాన్ సినిమాను మరో మెట్టు ఎక్కించారు. మొత్తంగా కన్నుల పండువ బాహుబలి2

Summary
Review Date
Reviewed Item
బాహుబలి 2 రివ్యూ
Author Rating
41star1star1star1stargray
బాహుబలి: ది కన్‌క్లూజన్‌ కోసం యావత్ సినీ లోకం రెండేళ్లుగా ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ఒక్కమాటలో చెప్పలేం..ఓ తెలుగు చిత్రానికి ఇంతలా ఎదురుచూస్తున్నారంటే దానికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వమని చెప్పాలి.. వెండి తెర ఫై కళ్ళకు కట్టెల అద్భుతాలు సృష్టించవచ్చని బాహుబలి చిత్రం తో నిరూపించాడు. జులై 15 , 2015 న వచ్చిన బాహుబలి మొదటి పార్ట్ తెలుగు సినిమా స్థాయి ని దేశ వ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసింది..తెలుగు దర్శకుడికి హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీయగల సత్తా ఉందా అని అంత ఆశ్చర్య పోయారు.. ఇప్పుడు అదే బాహుబలి ది బిగినింగ్ కు బాహుబలి: ది కన్‌క్లూజన్‌ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..రెండేళ్లుగా జనాల్లో నానుతున్న ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్నకు సమాధానం దొరికింది..ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9 వేల థియేటర్స్ లలో రిలీజ్ అయినా తెలుగు సినిమా గా రికార్డు సృష్టిచింది..భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా బాహుబలి 2 లో రాజమౌళి ఏం చూపించాడు..? అసలు బాహుబలి ని ఎందుకు చంపాల్సి వచ్చింది .? దేవసేన ఎందుకు బందీ కావాల్సి వచ్చింది..అవంతిక కు దేవసేన కు సంబంధం ఏంటి..? చివరకు మాహిష్మతి సామ్రాజ్యానికి రాజు ఎవరవుతారు..అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.. కథ : ‘పరమేశ్వర ఈ బిడ్డ బతకాలి’ అంటూ శివగామి డైలాగ్‌తో సినిమా మొదలవుతుంది..రాక్షస దహన కాండ కోసం వెళ్తుండగా, శివగామికి ప్రమాదం జరుగుతుంది..ఆ ప్రమాదం నుండి శివగామి ని బాహుబలి కాపాడతాడు..ఆ తర్వాత పట్టాభిషేకం జరిగేలోపు దేశ పర్యటన చేసిన రమ్మని అమరేంద్ర బాహుబలిని శివగామి ఆదేశిస్తుంది..దీంతో రాజమాత మాట మేరకు బాహుబలి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు..ఆలా చిన్న రాజ్యం అయినా కుంతలరాజ్య నికి బాహుబలి ఏమి తెలియని అమాయకుడు గా వెళ్ళతాడు.. యువరాణి దేవసేనను చూసి అమరేంద్ర బాహుబలి ప్రేమలో పడతాడు.ఈ విషయం వేగుల ద్వారా భళ్లాల, బిజ్జలదేవుడులు తెలుసుకుంటారు. ఆ తర్వాత దేవసేన గురించి తెలుసుకున్న భల్లాల..ఆమె అందానికి దాసోహం అవుతాడు..ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలి భావిస్తాడు.. అప్పుడే కథ మలుపు తిరిగే ట్విస్ట్ వస్తుంది..దాని కారణంగా రాజు కావాల్సిన బాహుబలి సేనాధిపతి అవుతాడు..భల్లాల కాస్త రాజు అవుతాడు. దేవసేన ను బాహుబలి పెళ్లి చేసుకొని సేనాధిపతిగా రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తాడు.. దేవసేన ఫై కోపం తో భల్లాల బాహుబలి ని చంపాలనుకుంటాడు.. ఈ క్రమం లో కట్టప్ప బాహుబలి ని చంపాల్సి వస్తుంది..కానీ బాహుబలి ని చంపాలని శివగామినే ఆదేశించడం కథలో అసలైన ట్విస్ట్..ఇంతకీ శివగామి ఎందుకు చంపమని ఆదేశం ఇస్తుంది..? ఆ తర్వాత బాహుబలి కొడుకును ఎందుకు కాపాడాలనుకుంటుంది..? శివుడు (బాహుబలి కుమారుడు) ఎలా భల్లాల ఫై యుద్ధం చేస్తాడు..? ఈ యుద్ధం లో భల్లాలదేవా ఎలా చనిపోతాడు అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.. ప్లస్ : ఒక్క మాటలో చెప్పాలంటే కథలో అన్ని ప్లస్లే… * రాజమౌళి దర్శకత్వం.. * ప్రభాస్ , రానా ల నటన.. * ఏం ఏం కీరవాణి బ్యాక్ గ్రౌండ్… * సెంథిల్ కుమార్ సినిమా ఫోటోగ్రఫి * నిర్మాణ విలువలు * క్లైమాక్స్ మైనస్ : * ఇలాంటి గొప్ప చిత్రం లో మైనస్ లు పెద్దగా కనిపించవు..కాకపోతే కొంతమందికి కొన్ని సందేహాలు రావడం చాల కామన్..ఇందులో కూడా అలాంటివే కనిపించాయి.. * భల్లాలదేవ భార్య ఎవరు ? * తమన్నా ఏమైంది… ? * అసలు శివగామి నిజంగానే మరణించిందా.. ? న‌టీన‌టుల పెర్పామెన్స్ : * అమరేంద్ర బాహుబలి గా ప్రభాస్ నట విశ్వ రూపం చూపించాడు..బాహుబలి కోసం ప్రభాస్ ఏకంగా నాలుగేళ్ల పాటు సమయం కేటాయించడం అభిమానుల్లో ఎక్కడో కాస్త నిరుత్సహం కనిపించింది..కానీ సెకండ్ పార్ట్ చూసి ప్రభాస్ నిర్ణయం తప్పు కాదని అంత అనుకుంటారు. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ దాంట్లో అద్భుతమైన నటనతో అలరించాడు. ఇక భల్లాలదేవ రానా ఫస్ట్ పార్ట్ లో కన్నా ఇందులో అసలు సిసలైన విలనిజం చూపించి ఆశ్ఛర్య పరిచాడు. క్రూరత్వం, కండబలం కలిగిన బల్లాలదేవుడిగా రానా నటనకు థియేటర్స్ లలో జై జై లు పలుకుతున్నారు. కుంతల రాజ్య యువరాణిగా దేవసేన రోల్ లో అనుష్క గ్లామర్ తో ఆకట్టుకుంది.. * ఓం నమో వెంకటేశాయ , సింగం త్రీ చిత్రాల్లో అనుష్క భారీగా కనిపించడం తో బాహుబలి 2 లో అదే విధంగా కనిపిస్తుందని అంత అనుకున్నారు కానీ వారు అనుకున్నట్లు అనుష్క కనిపించలేదు..రాజమాత శివగామి గా రమ్య కృష్ణ ఫస్ట్ పార్ట్ లో కొద్దిసేపు కనిపించే అదరగొట్టింది..కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం చించేసింది. కథ కి అసలు ట్విటర్ ఈమె ఇస్తుందని ఎవ్వరు ఊహించలేదు. * దేవసేన బావగా కుమారవర్మ(సుబ్బరాజు) రోల్ పర్వాలేదు.. * శివుడి…

బాహుబలి 2 రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 3.75
నటీ నటుల ప్రతిభ - 4.25
సాంకేతికవిభాగం పనితీరు - 4.5
దర్శకత్వ ప్రతిభ - 4.75

4.3

బాహుబలి 2 రివ్యూ

బాహుబలి 2 రివ్యూ

User Rating: 4.52 ( 3 votes)
4