మెల్ బోర్న్ లో బాహుబలి పెళ్లిచూపులు

0Baahubali-pellichupupluసారీ అండీ.. హెడ్డింగ్ లో బాహుబలి అండ్ పెళ్లిచూపులు మధ్యన కామా మిస్సయ్యంది. ఇవి బాహుబలి పెళ్ళిచూపులు గురించి కాదండోయ్. ఆ రెండు సినిమాల గురించి. బాహుబలి.. పెళ్లి చూపులు.. ఈ రెండు సినిమాలు వేర్వేరు నేపథ్యాలు అయినా.. విజయాలు మాత్రం సంచలనాలు. చారిత్రాత్మక విజయంతో బాహుబలి చరిత్ర సృష్టిస్తే.. లో బడ్జెట్ బాహుబలిగా అవతరించిన సినిమా పెళ్లిచూపులు. ఇప్పటికీ ఈ రెండు సినిమాల గురించి జనాలు మాట్లాడుకుంటూనే ఉంటున్నారంటే.. వాటికి ఏర్పడ్డ క్రేజ్ అర్ధమవుతుంది.

ఇప్పుడీ రెండు సినిమాలు ఓ సందర్భంలో కలవనున్నాయి. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ 2017లో ప్రదర్శించేందుకు ఈ రెండు తెలుగు చిత్రాలను ఎంపిక చేశారు. ఆగస్ట్ రెండో వారంలో ఐఐఎఫ్ఎం జరగనుండగా.. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి వేదికపై ప్రదర్శనక బాహుబలిని.. పెళ్లిచూపులు చిత్రాలను సెలక్ట్ చేయడం విశేషం. తెలుగు నుంచి ఎంపిక అయిన ఈ రెండు సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పాటు.. కమర్షియల్ గా విజయాలను సాధించాయి.

దేశంలోని ఇతర భాషల నుంచి కూడా పలు చిత్రాలను మెల్ బోర్న్ సినిమా పండుగలో ప్రదర్శించనుండగా.. అన్నీ విమర్శకుల నుంచి మన్ననలు పొందిన చిత్రాలే కావడం విశేషం. ఈ ప్రముఖ సినిమా వేడుకకు బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్.. ఐశ్వర్యారాయ్.. కొంకణా సేన్ శర్మలు హాజరు కానున్నారని తెలుస్తోంది.