కొత్త చిత్రం ప్రకటించిన బాహుబలి నిర్మాతలు

0


Baahubali-Producersబాహుబలి ప్రాజెక్ట్ ఈ స్థాయిలో సక్సెస్ కావడంలో.. నిర్మాతల ఓర్పు నేర్పు ఎంతో ఉందనే విషయం ఒప్పుకోవాలి. ఇంత భారీ బడ్జెట్ పెట్టి.. ఇన్నేళ్ల పాటు ఒక సినిమా కోసం ఎదురుచూడ్డం.. ఆ ఫ్లేవర్ ని మెయింటెయిన్ చేసేందుకు చేసిన ప్లానింగ్ అన్నీ అద్భుతం అనాల్సిందే. ఇప్పుడీ నిర్మాతలు తమ కొత్త చిత్రాన్ని ప్రకటించేందుకు రెడీ అయిపోతున్నారు.

రీసెంట్ గా రాధ అంటూ పలకరించి.. ప్రస్తుతం మారుతితో మహానుభావుడు చేస్తున్న శర్వానంద్ హీరోగా.. కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఏకంగా 40 కోట్ల బడ్జెట్ కేటాయించారట ఈ ప్రొడ్యూసర్స్. భారీ సక్సెస్ సాధించిన శతమానం భవతి టోటల్ కలెక్షన్స్ 22 కోట్లు కాగా.. కొత్త సినిమా బడ్జెట్ శర్వానంద్ కి ఉన్న మార్కెట్ కు దాదాపు రెట్టింపు అని చెప్పాలి. పైగా ట్రాక్ రికార్డ్ ఏ మాత్రం బాగాలేని దర్శకుడిపై ఈ భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు నిర్మాతలు సిద్ధం కావడం విశేషం.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు కె.ఎస్. ప్రకాష్ దర్శకత్వంలో శర్వా కొత్త సినిమా స్టార్ట్ కానుంది. దీన్ని ఓ ఫ్యాంటసీ జోనర్ లోనే తెరకెక్కించనున్నారట. ప్రకాష్ భార్య కనిక స్క్రీన్ ప్లే సమకూర్చనుంది. గతంలో అనగనగా ఓ ధీరుడు అంటూ సిద్ధార్ధ్- శృతి హాసన్ జోడీగా ఓ ఫ్యాంటసీ మూవీని కె.ఎస్. ప్రకాష్ రూపొందించాడు కానీ సక్సెస్ టేస్ట్ చేయలేదు. అయితే.. బాహుబలి బ్రాండ్ నేమ్ తమ చిత్రానికి ప్లస్ అవుతుందని ఈ నిర్మాతలు భావిస్తున్నారట.