తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల మార్క్ ను అందుకున్న బాహుబలి-2!

0Baahubali-2-Clips-In-Socialతెలుగు రాష్ట్రాలైన ఏపి, తెలంగాణాల్లో సుమారు 6500 థియేటర్లలో విడుదలైన ‘బాహుబలి-2’ చిత్రం వసూళ్ల పరంగా అద్భుతమైన రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 5 రోజులకే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్క్ ను చాలా సులభంగా అందుకుని, లాంగ్ రన్ లో ఇంకా భారీ వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏరియాల వారీగా నమోదైన వసూళ్ల వివరాలను చూస్తే ఈ చిత్రం నిన్న నైజాం ఏరియాలో దాదాపు రూ. 5 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం అక్కడ మొత్తంగా రూ. 28.15 కోట్లు, సీడెడ్లో రూ. 17. 45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12. 85 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.10.84 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8. 67 కోట్లు, కృష్ణాలో రూ. 7.23 కోట్లు, గుంటూరులో రూ. 10. 83 కోట్లు, నెల్లూరులో రూ. 4.03 కోట్లు వసూలు చేసి మొత్తంగా రూ. 100.05 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో కేవలం 5 రోజుల్లో 100 కోట్ల మార్కును అందుకున్న చిత్రంగా ‘బాహుబలి-2’ రికార్డులకెక్కింది.