ఏపి, తెలంగాణాల్లో బాహుబలి-2 4రోజుల కలెక్షన్స్!

0Baahubali-2-Collectionsగత శుక్రవారం విడుదలైన ‘బాహుబలి-2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటిరోజే రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాతి రోజులో కూడా అదే జోరు కొనసాగించింది. ముఖ్యంగా ఆదివారం, నిన్న సోమవారం మే డే సెలవు కావడంతో కలెక్షన్లు స్టడిగానే కొనసాగాయి. నిన్న 4వ రోజు వరకు ఇరి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వసూలు చేసిన షేర్ మొత్తం 88.82 కోట్లుగా ఉంది.

ఇక ఏరియాల వారీగా చూస్తే అత్యధికంగా నైజాం ఏరియాలో రూ. 23.85 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం సీడెడ్లో రూ. 15.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11. 36 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.94 కోట్లు, గుంటూరులో రూ. 10.01 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8. 20 కోట్లు, నెల్లూరులో రూ. 3. 67 కోట్లు కలెక్ట్ చేసి ఇప్పటికే ఉన్న పాత రికార్డులనన్నింటినీ తుడిచి పెట్టేసి ఇప్పుడప్పుడే అధిగమించడం సాధ్యంకాని కొత్త లెక్కలను నమోదు చేస్తోంది.