బీచ్ లో చిందులు.. కేరటాలతో సరసాలు

0Baat-Ban-Jaye-Song-Making-for-A-Gentleman-Movieబాలీవుడ్ కొత్త తరంలో ఇప్పుడు ఎవరి తరువాత ఎవరు అనే లెక్కలు వేసుకోవడం మానేశారు. ఎవరికి వారే ఒక విహంగ పక్షులై ఎగిరిపోతున్నారు. అందరికి ఇప్పుడు మంచి హిట్ సినిమాలు వరుసుగా రావడం తో హీరోయిన్లు కూడా మంచి జోష్ గా సినిమాలు చేస్తున్నారు. సిధార్థ్ మల్హోత్రా హీరోగా జ్యాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా ఏ జెంటిల్ మాన్ సినిమా తొందరలో రాబోతుంది.ఈ సినిమాకు సంబంధించిన డిస్కో డిస్కో బాత్ బన్ జాయే పాటలు విడుదలై ఇప్పటికే ఈ సినిమా పై ఈ జంట పై అంచనాలు పెంచేశాయి.

‘బాత్ బన్ జాయే’ అనే పాట షూటింగ్ లో జరిగే సందడి ని ఒక ప్రోమో గా కట్ చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ పాటను చూస్తే షూటింగ్ చేస్తున్నప్పుడు సిధార్థ్ మల్హోత్రా – జ్యాక్విలిన్ ఫెర్నాండెజ్ లో ఉండే తుంటరి తనం బయటకు వచ్చి అల్లరి చేసినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్లు రాజ్ – డికే మాట్లాడుతూ “సినిమాలో ఇలాంటి పాట ఒకటి ఉండాలి అని ముందే అనుకున్నాం. మన లైఫ్ లో ఇలాంటి వీకెండ్ ఉంటే ఎంత బాగుంటుందో అనే ఆలోచన వచ్చే లా చేయడానికి ప్రయత్నం చేశాం అని చెప్పారు.”

హాట్ బ్యూటీ జ్యాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా ప్రతిరోజూ ఇలా బీచ్ లోనే జీవితం ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకునేదట. నీళ్ళలో ఆటలు కేరింతలు కొడుతూ చిన్న పిల్లలు లాగా ఆడుకున్నాం అంటోంది. సుందర్ – సుశీల్ అనే రెండు పాత్రలు చేసిన యాక్షన్ కామిడీ అందరిని ఆకట్టుకుంటుంది అని నమ్మకంగా చెబుతున్నారు ఏ జెంటిల్ మాన్ టీమ్. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాను రాజ్ మరియు డికే డైరెక్ట్ చేశారు. ఆగష్టు 25 న విడుదల చేయబోతున్నారు.