సుప్రియ ప్లీజ్ అది చెయ్…! ఏంటది..?

0supriya-in-babu-baga-busyసుప్రియ.. ఎవరీమె. ఏంటి చెయ్యమంటున్నారు అనుకుంటున్నారా.. తెలుగు సినీపరిశ్రమలో ఈ పేరు పెద్దగా తెలియకపోయినా ఇప్పుడు ఆమె పేరునే జపిస్తున్నారు నిర్మాతలు. కారణం ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా “బాబు బాగా బిజీ”. ఆ సినిమాలో ఆంటీగా నటించిన సుప్రియ శృంగార భరితమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. కేవలం సుప్రియను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు సినిమాకు ఇప్పటికీ వస్తున్నారట. అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఇందులో నటించిన సుప్రియకు మాత్రం చాలా బాగా పేరు వచ్చిందట.

కొత్తగా రానున్న సినిమాల్లో సుప్రియకు ప్రత్యేక క్యారెక్టర్లు ఇస్తాం.. రమ్మని నిర్మాతలు సుప్రియ ఇంటి ముందు క్యూ కట్టారట. అయితే సుప్రియ మాత్రం నిర్మాతల వినతులను సున్నితంగా తిరస్కరిస్తున్నారట. అలాంటి క్యారెక్టలు చేస్తే మళ్లీ తనకు అవకాశం రాకపోవచ్చని చెబుతోందట. అంతేకాదు హీరోయిన్‌గా అవకాశం వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను గానీ.. హీరోయిన్ పక్కన క్యారెక్టర్లు చేయనని చెబుతోందట.