బాబు గోగినేనికి చీటింగ్ చేసే అలవాటుందా?

0నోరు తెరిస్తే చాలు నీతులు చెప్పేయటం.. వాటికి తెలివైన లాజిక్కులు యాడ్ చేసే వ్యక్తులు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నారు. తాము చేసింది తప్పని ఒప్పుకోరు. తాము అలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న వివరణ ఇచ్చే క్రమంలో తమదేమీ తప్పు కాదని.. ఎదుటోడి తప్పే తన చేత అలా చేయించిందంటూ అందంగా కవర్ చేస్తారు. ఇలాంటి తీరు సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు.. అందునా నీతిమంతుడు.. ఉత్తముడైన బాబు గోగినేని కూడా చేస్తారన్న వైనం కెమేరాల సాక్షిగా తాజాగా బయటకు వచ్చింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదే బాబు గోగినేని ప్రజల్ని మోసం చేస్తున్నారని.. తాను నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యే వారి నుంచి వారి ఆధార్ వివరాలు సేకరిస్తున్నారని.. ఇది ఆధార్ చట్టం ప్రకారం తప్పంటూ కోర్టుకు ఫిర్యాదు అందటం.. దీనిపై కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. మొత్తంగా 11 సెక్షన్ల మీద కేసులు నమోదు చేసిన వైనం బిగ్ బాస్ షోలో ఉన్న బాబు గోగినేని తెలిసి ఉండదు.

తానెంత తెలివిగా ఉంటానన్న విషయాన్ని తరచూ తన మాటలతో చెప్పే బాబు గోగినేని బిగ్ బాస్ హౌస్ లో ఒక చిన్న పోటీ సందర్భంగా తనలోని మరో కోణాన్ని బయటకు తెచ్చి అందరికి షాక్ ఇచ్చారు. నిత్యం మానవ హక్కులు..స్వేచ్ఛ గురించి మాట్లాడే పెద్దమనిషి.. చిన్న టాస్క్ లో గెలవటం కోసం అడ్డదారి తొక్కటం.. ఆ విషయాన్ని తన జట్టు సభ్యుడితో షేర్ చేసుకుంటూ.. తాను తప్పు చేయలేదని.. ఎదుటి వారు గుర్తించకపోతే తానేం చేస్తానంటూ తెలివిగా తోసేయటం చూస్తే.. బాబు గోగినేనిలోని మరో కోణం భలేగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.

బయట ప్రపంచంలో బాబు గోగినేని తప్పు చేసినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసిన వేళలోనే.. బిగ్ బాస్ హౌస్ లో మాయ చేసిన బాబు గోగినేని ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చెరుకురసం ఫ్యాక్టరీ టాస్క్ లో భాగంగా తాను చేసిన పని గురించి బాబు గోగినేని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

కౌశల్ తో మాట్లాడుతూ.. తమ టీమ్ నింపిన 100 చెరుకురసం బాటిళ్లలో 30 బాటిళ్లలో తాను నీళ్లు పోసినట్లుగా చెప్పారు. ఆ మాటకు షాక్ కు గురైన కౌశల్.. సార్ మీరు కూడా చీట్ చేస్తారా? అని ప్రశ్నించగా.. తాను కెమేరాకు చూపించే చేశానని.. అది తన తప్పు కాదని.. అక్కడున్న భానుశ్రీ కనిపెట్టకపోవటం ఆమె తప్పుగా చెప్పటం గమనార్హం. బాబు లాంటోళ్ల మాటల్ని చూసినప్పుడు.. దొరికితే దొంగ అన్న మాట పాతది.. దొరికిన తర్వాత కూడా తాను దొంగను కాదెలా చెప్పటమే ఇప్పటి తీరు అన్న భావం కలగటం ఖాయం.