బాబూ…గోగినేని….ఏమిటీ పని?

0ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ షో ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మనిషిలోని భిన్న కోణాలను – నిజ స్వరూపాన్ని బయటపెట్టేందుకు ఉద్దేశించిన ఈ రియాల్టీ షోలో రోజులు గడుస్తున్న కొద్దీ గెలవాలన్న కోరికతో కంటెస్టెంట్ల అసలు రూపం బయటపడుతోంది. తమ అసలు యాటిట్యూడ్ బయటపెట్టుకుంటోన్న క్రమంలో ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న కంటెస్టెంట్లు మొదట్లో బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ – ఇగోను అణుచుకుంటూ హౌస్ లో మంచివారిగా కనిపించారు. ఇదే తరహాలో ప్రముఖ హేతువాది బాబు గోగినేని కూడా తన నాలెడ్స్ తో లాజిక్ లతో షో ఆరంభంలో తనదైన శైలిలో ప్రేక్షకులతోపాటు బిగ్ బాస్ ను కూడా ఆకట్టుకున్నారు. కానీ ఎపిసోడ్లు గడిచేకొద్ది బాబు గోగినేని బలహీనతలు – అసలు రంగు బయటపడుతోంది. ఓ సందర్భంగో తన హౌస్ మేట్ తో బాబు….మనుషుల స్థాయిల గురించి మాట్లాడడంతో ఆయన నిజ స్వరూపం బట్టబయలైంది.

బాబు సిద్ధాంతాలతో – విధానాలతో ఓ కంటెస్టెంట్ విభేదించడంతో ఆయన తనలోని బలహీనతలను బయటపెట్టుకుంటున్నారు. తాను అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తినని – ఒకే హౌస్ లో ఉంటూ…తెలుగులో మాట్లాడినంత మాత్రాన అందరం సమానం కాదని బాబు…షాకింగ్ కామెంట్స్ చేశారు. దాంతో పాటు ఒక హౌస్ మేట్ ను బయటకు పంపేందుకు బాబు ప్లాన్ వేసి దొరికిపోయారు. నిజాయితీగా ఉన్న గీతా మాధురిని మెచ్చుకున్న బాబు…అదే కారణంతో ఆమెను షో నుంచి వెళ్లిపోవాలని సలహా ఇచ్చాడు. హేతువాదానికి విరుద్ధంగా బాబు..ద్వంద్వ ప్రమాణాలు పాటించడం విడ్డూరం. అయితే మానవతావాది – లాజికల్ థింకర్ – హేతువాదినని చెప్పుకునే బాబు…మనుషులంతా సమానమేనన్న ఇంత చిన్న లాజిక్ ను ఎలా మిస్సయ్యారో అర్థం కాని పరిస్థితి. మరి బాబు అసలు రంగును నాని వచ్చే వీకెండ్ లో బట్టబయలు చేస్తాడో లేదో వేచి చూడాలి.