‘ మహానటి ‘ యూనిట్ ఫై చంద్రబాబు ప్రశంసలు..

0అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెల్సిందే. ఈ మూవీ మే 09 న ప్రేక్షకుల ముందుకు వచ్చి , సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు సినిమా యూనిట్ ఫై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు ఈ సినిమాను చూసి చిత్ర యూనిట్ ను అభినందించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సావిత్రి జీవితానికి సార్థకత తీసుకురావాలనే పట్టుదలతో ఈ సినిమాలో కీర్తి సురేష్ బాగా నటించారని కొనియాడారు. సావిత్రి తన జీవితంలో పడిన కష్టాలకు ఈ సినిమా అద్దం పట్టిందని ప్రశంసించారు. కష్టాల్లో కూడా ఇతరులకు సహాయ పడాలనే సావిత్రి జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ‘మహానటి’ సినిమాను చాలా చక్కగా తీసినందున నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్‌లను చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సినిమాకు పన్ను మినహాయింపుపై ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తామని సీఎం అన్నారు. ప్రభుత్వం ‘మహానటి’ సినిమాకు పన్నుమినహాయింపు కల్పిస్తే.. ఆ మొత్తం రాజధాని నిర్మాణానికే ఇస్తామని నిర్మాత అశ్విని దత్‌ వెల్లడించారు.