తెలంగాణ నిర్ణయాన్ని వాయిదాకు చంద్రబాబు ప్రయత్నించారా?

0

babu-telanganaతెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేయించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చివరి ప్రయత్నం చేశారా? టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు తాను కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కాపాడానని, దానికి ప్రతిఫలంగా తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పెద్దలకు బాబు ఫోన్ చేసి మంతనాలు జరిపినట్టు ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఈ కథనంపై తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది.

ఐదు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్ష పరిష్కారానికి వచ్చిన వేళ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశాలు జరిగిన మంగళవారం తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు విఫలయత్నం చేశారని హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనంలో పేర్కొంది. ఇందుకోసం మంగళవారం నాటి సమావేశాలకు ముందు ఢిల్లీలోని పలువురు కీలక కాంగ్రెస్ నాయకులతో ఆయన మంతనాలు జరిపినట్లు పేర్కొంది.

గత రెండేళ్లలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఓడించలేదని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి గుర్తు చేసినట్టు సమాచారం. దీనికి ప్రతిఫలంగా తెలంగాణను కొంతకాలం ఆపాలని అభ్యర్థించారని పేర్కొంది. ఇందుకోసం చంద్రబాబు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారని హిందూస్థాన్ టైమ్స్ తన వార్తా కథనంలో పేర్కొంది.
Please Read Disclaimer