బధాయీ హో ట్రైలర్ టాక్

0కామెడీ సినిమాలలో తెలుగువాళ్ళను కొట్టే చెయ్యిలేదని చాలామంది తెలుగు ప్రేక్షకుల అభిప్రాయం. కానీ ఈమధ్య హిందీ వాళ్ళు కూడా మనకు గట్టిగా పోటీ ఇస్తున్నారు. ఇక ఈ ‘బధాయీ హో’ సరిగ్గా అలాంటి చిత్రమైన కంటెంట్ ఉన్న కామెడీ ఎంటర్టైనర్. ‘విక్కీ డోనార్’ వంటి విభిన్న చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయుష్మాన్ ఖురానా ఇందులో హీరో.

ఇక స్ట్రెయిట్ గా సినిమా థీమ్ లోకి వెళ్తే హీరో కు ఒక లవ్ స్టొరీ…ఇంకెవరితో.. హీరోయిన్ తోనే. అదేమీ కొత్త కాదు కదా. ఇక హీరో కు ఇబ్బంది కలిగించే విషయం ఏం జరుగుతుందంటే ఆయుష్మాన్ ఖురానా పెళ్ళికి సిద్ధమైన వయసులో వాళ్ళమ్మగారు గర్భం దాలుస్తుంది! ఇక చూడండి హంగామా.. హీరోకేమో అది నామోషీగా అనిపిస్తుంది. హీరో నాన్నను హీరో నానమ్మ అడిగిన డైలాగ్ ఇది “కోడలు రోజు ఒళ్ళు నొప్పులంటూ ఉంటే నా మట్టి బుర్రకు తట్టలేదు.. ఇంత ఇరుకు కొంపలో.. ఈ హంగామాలో అసలు నీకు టైమ్ ఎలా దొరికిందిరా!?”

ఇక అమ్మను తీసుకొని రెగ్యూలర్ మంత్లీ చెకప్ కు వెళ్తే అక్కడ హీరో ను చూసిన పక్క పేషెంట్లు హీరో తన భార్యను చెకప్ కు తీసుకొచ్చాడని అనుకుంటారు. హీరో అమ్మగారిని చూడగానే అవాక్కవుతారు. ఇక ఈ గోల ఇలా ఉంటే హీరోయిన్ తో మంచి సెక్సీ మూడ్ లో ఉండే టైం లో హీరోకు తను పెద్దన్న కాబోతున్నడనే విషయం గుర్తొస్తుంది. వెంటనే లేచి “తూహి బతా యార్. ఏ కోయి మమ్మీ పాపా అబ్ కర్నేకీ చీజ్ హై క్యా?” (నువ్వే చెప్పు.. ఇదంతా అమ్మా నాన్నా ఈ వయసులో చేసే పనులా?). అసలే మూడ్ లో ఉన్న హీరోయిన్ చేతికి దొరికిన వస్తువును హీరో మొహాన కొడుతుంది.

ఇదండీ వరస.. కొంత ఆడ్ గా అనిపించినా మామూలుగా లేదు కామెడీ. పాత కాలంలో ఇలాంటి సన్నివేశాలు చాలా సాధారణం అయినా ఈ జనరేషన్ వాళ్ళకు కొత్తే. సో వై డిలే జస్ వాచ్ ద ట్రైలర్.

అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ ‘దంగల్’ ఫేమ్ సాన్యా మల్హోత్రా. ‘బధాయి హో’ దర్శకుడు అమిత్ రవీందర్ నాథ్ శర్మ. జంగ్లీ పిక్చర్స్ – క్రోమ్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.