యూట్యూబ్ నుంచి తీసేస్తున్న ద్యావుడా టీజర్

0dyavuda-teaserహిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా “ద్యావుడా” అనే సినిమాని రూపొందించారని, ఈ సినిమా విడుదల కాకుండా ఆపివేయాలని, లేకపోతే భౌతిక దాడులకు కూడా వెనకాడబోమని భజరంగ్‌దళ్ కార్యకర్తలు హెచ్చరించారు. జనవరి 1న యూట్యూబ్‌లో “ద్యావుడా” అనే కొత్త సినిమా టీజర్‌ విడుదలైన విషయం తెలిసిందే. అయితే అందులోని కొన్ని దృశ్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయని నెరేడ్మెట్ పోలీసులకు భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఆ టీజర్‌లో వేంకటేశ్వరస్వామి ఫోటోను నెలకేసి కొట్టడం, శివలింగంపై బీరుతో అభిషేకం చేయడం, సిగరెట్లు కాల్చి ధూపం పెట్టడం లాంటి సన్నివేశాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఏమిటని ప్రశ్నించారు. పైగా టీజర్‌ను యూట్యూబ్‌లో పెట్టి ప్రచారం చేస్తున్నారని, వెంటనే యూట్యూబ్ నుండి ఆ టీజర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమాను రిలీజ్ చేయకుండా నిలిపివేయాలని లేకపోతె తాము భౌతిక దాడులకు కూడా దిగుతామని హెచ్చరించారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ “హరి”ని, డైరెక్టర్ “సాయిరాం దాసరి”ని వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

”లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న మూడు జంటలు ఓ పామ్‌హౌ్‌స్‌‌‌కి వెళ్లినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చాడు అన్న భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం” అని నిర్మాత చెప్పినప్పటికీ మరీ ఇంత ధారుణం గా మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీయటం పై బ్రాహ్మణ సంఘాలు మండి పడ్డాయి. దాంతో ఈ ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల డీజీపీలు సానుకూలంగా స్పందించారు. ఈ సినిమా టీజర్ ను యూట్యూబ్ నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పినట్టు సమాచారం…