బాలయ్య 101వ చిత్రం ప్రారంభం

0NBK-101బసవతారకరామపుత్ర బాలకృష్ణ 101వ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇవాళ ఉదయం కూకట్‌పల్లి తులసీవనంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవం కార్యక్రమంలో బాలకృష్ణ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ ప్రముఖులు క్రిష్, ఎస్వీ కృష్ణా రెడ్డి, బోయపాటి శ్రీను, అలీ, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మంట్స్ బ్యానర్ అధినేతలు పాల్గొన్నారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ద్వారా ఇద్దరు కొత్త హీరోయిన్లు పరిచయం కానున్నట్టు తెలుస్తోంది.

బాలకృష్ణ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. స్టార్ హీరోలతో బద్రి, శివమణి, పోకిరి, బిజినెస్ మేన్, టెంపర్ వంటి మాస్ చిత్రాలు తెరకెక్కించిన పూరి డైరెక్షన్‌లో సినిమా అనగానే నందమూరి అభిమానుల్లోనూ అంచనాలు రెట్టింపయ్యాయి.