ఆరంభంలోనే ఫైట్స్ చేయనున్న బాలయ్య !

0Puri-Jagannath-balayya-Movieనందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ ల క్రేజీ కాంబినేషన్లో సినిమాకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మొదటి షెడ్యూలుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపటి నుండి హైదరాబాద్లో ఈ షెడ్యూల్ మొదలుతుంది. మార్చి 22 వరకు జరగనున్న ఈ షెడ్యూల్లో మొదట కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తారట. అంటే బాలయ్య ఆరంభంలోనే ఫైట్స్ చేస్తున్నాడన్నమాట.

కనీసం ఊహకు కూడా అందని ఈ కాంబినేషన్ చాలా వేగంగా సెట్ అవడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో అసలు ఈ సినిమా ఉండబోతోంది, ఇద్దరి ఐడియాలజీ, స్టార్ ఇమేజ్ స్థాయి పెద్దవే కాబట్టి రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనే ఆలోచనలు మొదలయ్యాయి. పూరి కూడా సినిమా ఏమాత్రం అభిమానుల్ని నిరుత్సాహపరచకుండా అనుకున్న టైమ్ కి రిలీజవుంతుందని చెప్పడం, బాలయ్య తన పాత్ర నందమూరి ఫ్యాన్సుకు కనుల పండుగలా ఉంటుందని చెప్పడంతో అంచనాలు భారీ స్థాయిలో క్రియేట్ అయ్యాయి. ఇక మొదటి షెడ్యూల్ అనంతరం రెండవ షెడ్యూల్ ను ఇంగ్లాండ్ లో నెలరోజుల పాటు జరపనున్నారట. భవ్య ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నాడు.