ఫేస్‌ బుక్ లైవ్‌లోకి బాలయ్య

0Paisa-vasool-looksబాలయ్య బర్త్ డే సందర్భంగా అభిమానులతో ఫేస్ బుక్ లైవ్‌లో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఆయన నటిస్తున్న ‘పైసా వసూల్’ మూవీ ముచ్చట్లను అభిమానులతో షేర్ చేసుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియ, ముస్కాన్‌, కైరా దత్‌ నాయికలుగా నటిస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం ఈ సందర్భంగా ‘పైసా వసూల్’ నిర్మాత మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ – పూరి జగన్నాథ్‌ కలయికలో మేం సినిమా ప్రకటించగానే పెద్దయెత్తున అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు.

మే 12 నుంచి పోర్చుగల్‌లోని లిస్బన్‌, పోర్టో సిటీల్లో అరుదైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం. ఈ నెల 16 వరకు షెడ్యూల్‌ కొనసాగుతుంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శనివారం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల నుంచి ఫేస్‌బుక్‌లో లైవ్‌ ఏర్పాటు చేశాం. బాలకృష్ణ, పూరిజగన్నాథ్‌ ఇందులో పాల్గొంటారు. బాలకృష్ణ పాల్గొనబోయే తొలి ఫేస్‌బుక్‌ లైవ్‌ ఇదే. భవ్య క్రియేషన్స్‌ ఫేస్‌బుక్‌ పేజీలో ఈ లైవ్‌ని చూడొచ్చని’అన్నారు.PaisaVasool