బాలయ్య స్మోకింగ్ దబిడి దిబిడే

0

Balakrishna-caught-Smokingకొంతమంది స్టార్ల రూటే సెపరేటు.. అలాంటి స్టార్లలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలయ్య రొటీన్ కి భిన్నంగా ఈసారి ఫ్యాన్స్ పై ‘కాలు’ చేసుకున్నారని తాజాగా వార్తలు వచ్చాయి. మీరు ఆ న్యూస్ చదివే ఉంటారు కాబట్టి దాని సంగతి పక్కన బెట్టి మరో వైరల్ వీడియో గురించి మాట్లాడుకుందాం.

బాలయ్య నిన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ‘నాన్నగారు’ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ తర్వాత రోడ్ షోలో పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ పూర్తయిన తర్వాత రోడ్ షో లో పాల్గోనేందుకు కారు ఎక్కగానే స్టైల్ గా ఒక సిగరెట్ తీసి లైటర్ తో వెలిగించి గట్టిగా ఓ దమ్ము లాగారు. ఈ తతంగాన్ని బాలయ్య అభిమాని ఒకరు వీడియో తీయడం జరిగింది. వీడియోలో బాలయ్యకు ఫ్యాన్స్ జేజేలు పలకడం కూడా వినిపిస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలోకి రావడం.. ఇప్పటికే వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి.

బాలయ్య స్మోకింగ్ వీడియో బయటకు రావడం ఇది మొదటిసారేం కాదు. గతంలో బాలయ్య సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పబ్లిక్ గా స్మోక్ చెయ్యడంతో అదొక పెద్ద వివాదం అయింది. ఎంఎల్ఎ అయి ఉంది బహిరంగ ప్రదేశంలో ఇలాంటి వాటి కి చరమ గీతం పాడకుండా తనే ఆ పని చేయడం ఏంటని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పర్సనల్ వెహికల్ కాబట్టి అలాంటి ఇబ్బందేమీ లేదు.
Please Read Disclaimer