బాలయ్య బుద్ధిమంతుడు!

0

బాలయ్యలోని బుద్ధిమంతుడి గురించి ఏమని పొగడాలి? టాలీవుడ్ లో ఎందరు హీరోలు ఉన్నా ఆయన వేరే! లెజెండ్ ఎన్టీఆర్ నటవారసుడిగా పరిశ్రమలో ప్రవేశించి తొలి నాళ్ల నుంచి దర్శకుల హీరోగా మన్ననలు పొందాడు. అతడు ఒకసారి దర్శకుడిని నమ్మారంటే ఇక వెనుతిరిగి చూసే పనే లేదు. ఆ దర్శకుడి కోసం ప్రాణం పెట్టేస్తారు. డైరెక్టర్ ఏం చెబితే అది మాత్రమే చేస్తారు. ఆ కమిట్ మెంట్ వేరొక ఏ హీరోలోనూ చూడలేమని ఆన్ లొకేషన్ చూసిన వారు నేరుగా చెబుతుంటారు. దీనిపై సినీ మీడియాలోనూ నిరంతరం చర్చ సాగుతుంటుంది. ఒక దర్శకుడికి అలాంటి హీరోనే కావాలి. ప్రతిదానికి అడ్డగోలుగా వాదించే హీరోల వల్ల సినిమా నాశనం అవ్వడం తప్ప ఒరిగేదేం ఉండదనే చర్చ పరిశ్రమలో నిరంతరం సాగుతూనే ఉంటుంది.

ఇదిగో ఇక్కడ ఈ ఫోటోలో చూడండి.. క్రిష్ చెబుతుంటే ఎంత బుద్ధిగా వింటున్నారు బాలయ్య! ఆయన దర్శకుల హీరో అని పొగిడేది అందుకే! లెజెండ్ ఎన్టీఆర్ ఆహార్యం గురించి బాలయ్య కు క్రిష్ చెబుతుంటే ఎంతో ఒద్దికగా వింటున్నారు బాలకృష్ణ. అంత పెద్ద స్టార్ అంత వినమ్రంగా ఒక దర్శకుడిని ఫాలో అవ్వడం అంటే ఆ కాన్ సన్ ట్రేషన్ ముచ్చట కలిగించక మానదు. ఇకపోతే ఎన్టీఆర్ గురించి బాలయ్య కంటే క్రిష్ నే ఎక్కువ చదివాడన్న సంగతి కూడా అర్థమవుతోంది ఈ ఫోటోలు వీక్షించాక. “ఓ చరిత్రకు తెరతీస్తున్న శుభదినాన జరుపుకుంటున్న జన్మదినం..
యుగపురుషుడితో సాగుతున్న ఈ ప్రయాణం..“ అంటూ ఎంతో ప్రేమతో ఈ సినిమాని తీస్తున్నానని క్రిష్ తన జన్మదినం(నిన్నటి) రోజున చెప్పకనే చెప్పాడు.

డెడ్లైన్ ప్రకారం.. ఇప్పటికే ఎన్టీఆర్ పార్ట్ 1 -కథానాయకుడు టాకీ పూర్తయింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రాన్న రిలీజ్ చేయడమే ధ్యేయంగా ఉన్నారు క్రిష్. జనవరి 24 రిపబ్లిక్ డే రిలీజ్ కానుకగా మహానాయకుడు చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అందుకే రెండో పార్ట్ షూటింగ్ అంతే శరవేగంగా పూర్తి చేస్తున్నారట. సినిమా – రాజకీయాలు రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ ఎన్టీఆర్ అభిమానుల మనసు నొప్పించకుండా – చరిత్ర వక్రీకరించకుండా ఈ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఎన్ బీకే పతాకంపై నందమూరి బాలకృష్ణ- సాయి కొర్రపాటి- విష్ణు ఇందూరితో కలిసి ఈ బయోపిక్ ని నిర్మిస్తున్నారు. మరకతమణి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Please Read Disclaimer