2018 లోనే బాలకృష్ణ వారసుడి ఎంట్రీ !

0mokshagnyaనందమూరి ఫ్యామిలీ నుండి నెక్స్ట్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న వ్యక్తి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై రక రకాల వార్తలు వినిపిస్తూ వచ్చాయి. పలువురు దర్శకుల పేర్లు కూడా వినబడ్డాయి. కానీ ఇంకా ఎవరూ కన్ఫర్మ్ కాలేదు. అయితే మోక్షనాజ్ఞా వెండితెర ఎంట్రీ మాత్రం 2018 లో జరుగుతుందని ఖాయంగా తెలుస్తోంది.

ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు కావడంతో సినీ సర్కిల్స్ లో ఎక్కడ చూసిన ఇదే టాపిక్ నడుస్తోంది. మోక్షజ్ఞ ప్రస్తుతం హీరోగా అన్ని విధాల సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడని, ఎంట్రీ భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. మరి ఇంతలా అంచనాలున్న ఈ ఎంట్రీ ఏ దర్శకుడి ద్వారా ఏ తరహా సినిమా రూపంలో జరుగుతుందో వచ్చే ఏడాది బయటపడనుంది.