ట్విస్ట్: బోయపాటి సినిమాతో పాటుగా మరో సినిమా!

0

నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ సినిమా ఏంటి? ఈ ప్రశ్న అడగ్గానే మీరు పుసుక్కున బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కే భారీ యాక్షన్ చిత్రం అంటారు. కానీ అది సగమే ఆన్సర్.. ఎందుకంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. బాలయ్య తన సినిమాలు చేయడంలో తన జోరు పెంచారు. బోయపాటి సినిమాతో పాటు మరో సినిమాకు కూడా గ్రీన సిగ్నల్ ఇచ్చారు.

తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ తో బాలయ్య సినిమా కన్ఫాం అయింది. బాలయ్య – కేయస్ రవి కుమార్ కాంబినేషన్ లో గతంలో ‘జైసింహా’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి కాంబినేషన్ లో తెరకెక్కే రెండో సినిమాను కూడా ‘జైసింహా’ నిర్మాత C. కళ్యాణ్ నిర్మిస్తారు. ఈ సినిమాను మే నెలలో అధికారికంగా లాంచ్ చేస్తారని.. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.

ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం ఆగష్టులో పట్టాలెక్కుతుందని సమాచారం. కేయస్ రవి కుమార్ ప్రాజెక్ట్ తో పాటుగా ఈ సినిమా కూడా ప్యారలల్ గా షూటింగ్ జరుపుకుంటుందని అంటున్నారు. బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కనున్న చిత్రం హ్యాట్రిక్ ఫిలిం అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ బయోపిక్ వల్ల వచ్చిన లాస్ ను కవర్ చేసేందుకు బాలయ్య కేఎస్ రవికుమార్ తోనూ .. బోయపాటి తోనూ రెండు సినిమాలు ఒకేసారి చేయాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.
Please Read Disclaimer