బాలయ్య ఇంట బసవతారకమ్మ

0నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తండ్రి – తెలుగు లెజెండ్ ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చే భాద్యతను తలకెత్తుకున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి – బాలయ్య తల్లిగారు అయిన బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించనున్నారు.

బాలయ్య స్వయంగా పట్టుబట్టి – ముంబై వెళ్లి మరీ విద్యా బాలన్ ను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించిన విషయం కూడా తెలిసిందే. విద్యా బాలన్ ‘ఎన్టీఆర్’ షూటింగ్ లో పాల్గొనేందుకు ఈ మధ్యనే హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యా బాలన్ బాలయ్య కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.

విద్యా బాలన్ బాలయ్య ఇంటికి వచ్చిన సందర్భంగా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఆవిడతో ఆప్యాయంగా ముచ్చటించారని – ఎన్టీఆర్ పెద్ద కుమార్తె అయిన లోకేశ్వరి మన తెలుగు సంప్రదాయం ప్రకారం విద్యా కు ఒక మంచి చీర కూడా పెట్టిందని అంటున్నారు. ఏదేమైనా విద్యా బాలన్ కు నందమూరి విశిష్ట ఆతిథ్యం దక్కడం గొప్ప విషయమే. మరోవైపు – విద్యా బాలన్ ఈ రోజు(బుధవారం) నుండి రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘ఎన్టీఆర్’ టీమ్ తో జాయిన్ అయ్యారు.