బాలయ్య – ఎన్టీఆర్ ల వైరల్ వీడియో..

0నందమూరి కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. హరికృష్ణ మృతితో నందమూరి ఫ్యామిలీతో పాటు నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురైన విషయం తెల్సిందే. హరికృష్ణ మరణం నుండి మెల్ల మెల్లగా కుటుంబ సభ్యులు మరియు అభిమానులు తేరుకుంటున్నారు. హరికృష్ణ చనిపోయి మూడు రోజులు అయిన సందర్బంగా కుటుంబ సభ్యులు చిన్న కార్యంను చేయడం జరిగింది. ఈ కార్యంలో బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. కార్యం ముగిసిన తర్వాత ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు కలిసి భోజనం చేస్తుండగా అక్కడకు బాలకృష్ణ వెళ్లడం – వారితో కలిసి మాట్లాడటం అభిమానులకు సంతోషంను కలిగిస్తుంది.

తండ్రిని కోల్పోయిన ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లకు ఈ సమయంలో బాలకృష్ణ తండ్రిలా అండగా ఉండి – వారిని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. అయితే గత కొన్నాళ్లుగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ ఆ భాద్యత తీసుకుంటాడా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాని అన్న మరణంతో బాలకృష్ణ కుమిలి పోవడంతో పాటు – తన అన్న కొడుకులకు అండగా – ధైర్యంగా నిలబడాలని ముందుకు రావడం అభినందనీయం – సంతోషకర పరిణామం అంటూ అభిమాను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హరికృష్ణ మరణం అభిమానులను కలచి వేసినప్పటికి నందమూరి ఫ్యామిలీ అంతా ఇలా ఏకతాటిపైకి రావడం సంతోషాన్ని కలిగిస్తుంది. గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడు – ఎన్టీఆర్ ల మద్య కూడా విభేదాలంటూ ప్రచారం జరిగింది. తాజాగా హరికృష్ణ అంత్యక్రియలకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనడంతో ఆ విభేదాలు కూడా తొలగినట్లే అంటూ అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి తండ్రిని కోల్పోయిన నందమూరి బ్రదర్స్ కు బాబాయి ఇకపై తండ్రిగా నిలుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.