లెజెండ్ లోగో అదుర్స్

0Legend-First-Look-Logoబాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రం లెజెండ్‌. సింహా త‌ర‌వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం కాబ‌ట్టి అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అందుకే ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తి చిన్న విష‌యంలోనూ చిత్ర‌బృందం  ప్ర‌త్యేక శ్రద్ధ తీసుకొంటోంది. ఈరోజు లెజెండ్ లోగో బ‌య‌ట‌కు వ‌చ్చింది. పేరుకు త‌గ్గ‌ట్టు లెజెండ్‌లోగో లోనూ రాజ‌ఠీవీ క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ని కూడా వ‌దులుతార‌ట‌. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకొంది. ఇటీవ‌లే దుబాయ్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకొచ్చింది చిత్ర‌బృందం. ఇక్క‌డ మ‌రో పాట తెర‌కెక్కించాల్సివుంది. దాంతో షూటింగ్ పూర్త‌వుతుంది.