కనపడని పోటీ ఉంది నాయకా!

0

ఈ నెల 22 మహానాయకుడు విడుదల ఖరారు కావడంతో పాటు బిజినెస్ డీల్స్ కూడా కొలిక్కి వచ్చేసాయని సమాచారం. థియేటర్ల కేటాయింపు ఇంకో రెండు మూడు రోజుల్లో పూర్తయిపోతుంది. చాలా చోట్ల కథానాయకుడు వేసిన హాల్స్ లోనే మహానాయకుడు సందడి చేయబోతున్నాడు. సంక్రాంతి బరిలో ఒకటికి మూడు భారీ సినిమాలతో పోటీ పడాల్సి రావడం వల్లే కథానాయకుడు ఆశించిన స్థాయి కన్నా చాలా దారుణంగా ఆడిందని అభిమానులకు ఇప్పటికీ బలమైన అభిప్రాయం ఉంది. అందుకే ఇప్పుడు అంతా సానుకూలంగా ఉందని రిలీఫ్ అవుతున్నారు కానీ చాప కింద నీరులా మహనాయకుడికి పోటీ ఇప్పుడు కూడా తప్పడం లేదు. కాకపోతే అవి బాలయ్య సినిమాలు కాదు కాని కంటెంట్ నమ్ముకుని వస్తున్నవి కాబట్టి నిర్లక్ష్యం చేయడానికి లేదు.

పెళ్లి చూపులు-అర్జున్ రెడ్డిలతో పాపులారిటీ తెచ్చుకున్న ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ నటించిన మిఠాయి మీద అర్బన్ యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. డిఫరెంట్ థీమ్ తో రూపొందిన దీని ట్రైలర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. కాస్త ప్రచారం గట్టిగా చేసుకుంటే కుర్రకారును తనవైపుకు లాక్కునే ఛాన్స్ ఉంది. ఇక గత ఏడాది తమిళ్ లో విడుదలైన ఇమైక్క నోడిగల్ అక్కడ మంచి హిట్ అయ్యింది. క్రైం థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ఆ జానర్ ను ఇష్టపడే వాళ్లకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇది అంజలి సీబీఐ పేరుతో 22నే రిలీజ్ చేస్తున్నారు.

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న నయనతారది లీడ్ రోల్. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి క్యామియో మరో ప్రధాన ఆకర్షణ. సైకో కిల్లర్ గా అనురాగ్ కశ్యప్ ప్రశంశలు అందుకున్నాడు. సరిగ్గా పబ్లిసిటీ చేస్తే ఇది మనవాళ్లకు రీచ్ అయ్యే సబ్జెక్టే. సో మహానాయకుడు స్థాయికి ఈ రెండు సరితూగవు కానీ తక్కువ బజ్ తో వస్తున్న సీక్వెల్ కి ఎంతో కొంత పోటీ ఇచ్చేవే. ఇవి కాకుండా బాలీవుడ్ మల్టీ స్టారర్ టోటల్ ధమాల్ కూడా అదే రోజు రానుంది. ఏ సెంటర్స్ లో మల్టీ ప్లెక్సులను ఇది ప్రభావితం చేస్తుంది. బాగుంది అనే టాక్ వస్తే బాలయ్య సినిమాకు ఏ ఇబ్బంది లేదు కానీ ఆ విషయంలో ఎంత వరకు మెప్పించిందో వచ్చే వారం తేలిపోతుంది. కాకపోతే బయటికి కనిపించని ఈ పోటీని తట్టుకుని గట్టిగా నిలబడాలి
Please Read Disclaimer