పది కథలను రిజెక్ట్ చేసిన నందమూరి హీరో

0టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోల్లో స్పీడ్ గా సినిమాలు చేసే వారిలో నందమూరి బాలకృష్ణ టాప్ లో ఉన్నారని చెప్పాలి. ఎలాంటి సినిమాలు అయినా యువ హీరోలకంటే స్పీడ్ గా ఫినిష్ చేసి తన ఎనర్జీ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూపించేస్తారు. నేటితరం యువ హీరోలకు ఆయన ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం ఎన్టీఆర్ బయోపిక్ పైనే ఉంది. ఆ సినిమా జులై నుంచి రెగ్యులర్ గా స్టార్ట్ కానుంది.

క్రిష్ దర్శకత్వంలో ఆ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తరువాత ఇద్దరి దర్శకులతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. తనకు అత్యంత సన్నిహిత దర్శకుడు అయిన బోయపాటితో ఇప్పటికే బాలయ్య ఒక ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. ఆ తరువాత కమర్షియల్ దర్శకుడు వివి.వినాయక్ తో కూడా బాలకృష్ణ ఒక సినిమా ఉంటుందని చెప్పాడు. అయితే వినాయక్ బాలకృష్ణ ను మెప్పించే కథలను చెప్పడం లేదట.

ఇప్పటివరకు ఇంటిలిజెంట్ దర్శకుడు తీసుకువచ్చిన దాదాపు 10 కథలను బాలకృష్ణ రిజెక్ట్ చేశారట. వినాయక్ తన సన్నిహిత రైటర్స్ తో చాలా కథలను రాయిస్తున్నాడు. ఎక్కువగా తనకు చాలా సినిమాల్లో సహకారం అందించిన ఆకుల శివతో వినాయక్ చర్చాలు జరుపుతున్నారు. ఎలాగైనా బాలయ్యను మెప్పించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.