బాలయ్యను ఇలా చూస్తే షాకావాల్సిందే..

0Balakrishna-Simplicity-in-Paisa-Vasool-Setsస్టార్ హీరోల సినిమాల షూటింగ్ అంటే అక్కడ రెండు మూడు కారవాన్లు సిద్ధంగా ఉండాల్సిందే. షాట్ ఓకే అనడం ఆలస్యం.. హీరో వెంటనే కారవాన్లోకి వెళ్లిపోతుంటాడు. అక్కడ సకల సకల సౌకర్యాల మధ్య సేదతీరుతాడు. విదేశాలకు వెళ్లినా అక్కడ హీరోకు ఏ ఇబ్బందీ రాకుండా చూసుకోవాల్సిందే. అన్ని సౌకర్యాలూ సమకూర్చాల్సిందే. ఐతే నందమూరి బాలకృష్ణ మాత్రం సౌకర్యాల విషయంలో మరీ అంత పట్టుదలగా ఏమీ ఉండడంటారు. అప్పుడప్పుడూ షూటింగ్ స్పాట్లో ఆయన సింప్లిసిటీ చూసి జనాలు ఆశ్చర్యపోతుంటారని చెబుతుంటారు. ఇందుకు నిదర్శనంగా ఓ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

బాలయ్య కొత్త సినిమా ‘పైసా వసూల్’ షూటింగ్ దాదాపు నెల రోజుల నుంచి పోర్చుగల్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ షాట్ గ్యాప్ లో బాలయ్య రోడ్డు పక్కన పచ్చిక బయళ్లలో దిండేసుకుని పడుకుని కనిపిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. షూటింగ్ కోసం రెడీ అయిన గెటప్ లోనే బాలయ్య పడుకుని ఉండటం విశేషం. ఈ రోజు బాలయ్య పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య సింప్లిసిటీ ఇదీ అంటూ ఈ ఫొటోను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసి దటీజ్ బాలయ్య అంటూ నందమూరి అభిమానులు ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు. బాలయ్య పుట్టిన రోజు వేడుకలు పోర్చుగల్ లోనే ఘనంగా నిర్వహిస్తోంది చిత్ర బృందం ఇంకో పది రోజుల్లో అక్కడి షెడ్యూల్ ముగించుకుని ఇండియాకు రానుంది ‘పైసా వసూల్’ టీం.