మోక్షజ్ఞ ఎంట్రీ… బాలయ్య పాత మాటే

0

నందమూరి ఫ్యామిలీ నుండి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అంటూ ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడు ఏళ్లుగా అదుగో ఇదుగో అంటూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించిన వార్తలు మీడియాలో కూడా సందడి చేస్తున్నాయి. మోక్షజ్ఞ కోసం బాలయ్య కథలు వింటున్నాడంటూ కొన్ని కథలు ఎంపిక చేశాడని వాటిల్లోంచి ఒకదాన్ని కొడుకు కోసం ఫైనల్ చేయనున్నాడని కథనాలు వచ్చాయి. అయితే బాలకృష్ణ మాత్రం ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడిగినా కూడా వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం అవుతుందని చెబుతూ వస్తున్నాడు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ అంటూ ప్రచారం జరిగింది. ఆ సమయంలో బాలకృష్ణ స్పందిస్తూ మోక్షజ్ఞ డైరెక్ట్ గా హీరోగానే పరిచయం అవుతాడు వచ్చే ఏడాది సినిమా పట్టాలపైకి వెళ్లనుందని ప్రకటించాడు. వచ్చే ఏడాది పోయి రెండు ఏళ్లు అవుతుంది. తాజాగా మరోసారి అదే మాటను బాలయ్య చెప్పాడు. ‘మహానాయకుడు’ విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ విషయమై మాట్లాడాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమాలకు సిద్దం అవుతున్నాడు వచ్చే ఏడాది సినిమాను మొదలు పెట్టనున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఈమద్య కాలంలో మోక్షజ్ఞ మీడియా ముందుకు వచ్చిందే లేదు. అసలు మోక్షజ్ఞ ఎలా ఉన్నాడు అనే విషయంలో క్లారిటీ లేదు. కొందరు బాగా లావు అయ్యాడు బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. బరువు తగ్గిన తర్వాత సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు. మరి కొందరు మాత్రం నటనలో పూర్తి శిక్షణ తీసుకున్న తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. బాలయ్య ఈసారి అయినా చెప్పినట్లుగా వచ్చే ఏడాదిలో కొడుకును పరిచయం చేస్తాడో చూడాలి.
Please Read Disclaimer