బాలయ్య క్లారిటీ ఇచ్చాడు

0balayya1ఇటీవల పాయకరావు పేటలో బాలయ్య ఫ్యాన్స్‌తో సమావేశమైన రాష్ర్ట అధ్యక్షుడు సీహెచ్.రమేష్…టీడీపీలో బాలయ్యకు సముచిత స్థానం ఇవ్వలేదని, నందమూరి వారసులకు పార్టీలో ప్రాధాన్యం ఇచ్చి తీరాలని, పార్టీకి బాలయ్యను అధ్యక్షుడు చేయాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.ఈ వ్యాఖలు బాలయ్యే పరోక్షంగా చేయించారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో పాటు బాలయ్య లెజెండ్ ఆడియో ఫంక్షన్ కి చంద్రబాబు ను ఆహ్వానించక పోవటంతో వీరి మధ్యన ఏవో మనస్పర్థలు వచ్చాయిని కధనాలు వినిపించాయి.
ఈ ఊహాగానాలు మరింత జోరందుకోవటం తో వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నేరుగా బాలయ్య రంగం లోకి దిగారు.ఈ ఊహాగానాలు పై బాలయ్య మాట్లాడుతూ… తనకు, బావ (చంద్రబాబు)కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. లెజెండ్ ఆడియో ఫంక్షన్ లో అభిమానులు గొడవ చేస్తారనే ఉద్దేశంతోనే చంద్రబాబును ఆహ్వానించలేదని తెలిపారు. ఈ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలని విన్నవించారు.బాబుకు, బాలయ్యకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పిన బాలయ్య మాటలను టీడీపీ నేతలు కూడా బలపరిచారు.దీంతో ఊహాగానాలు తెరపడింది.