సైకిల్ తొక్కిన బాలయ్య

0హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం అనంతపురంలో సందడి చేశారు లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ కొడికొండ చెక్‌పోస్ట్‌ వద్ద ప్రారంభించిన సైకిల్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సైకిల్‌ తొక్కి అభిమానులను ఉత్సాహపరిచారు. లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని , లేపాక్షి గొప్పతనాన్ని నలుదిశలా చాటి చెప్పాలని ఆయన చెప్పారు.

ఇక బాలయ్య సినిమా విషయానికి వస్తే.. విశ్వ విఖ్యాత నట స్వారభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్క సినిమా కోసం ఆయన రెడీ అవుతున్నారు ఈ సినిమా తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.