హైదరాబాద్ లో జై సింహ ఫస్ట్ షో

0Jai-Simha-hyd-showనందమూరి బాలకృష్ణ , నయనతార జంటగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వం లో సి కళ్యాణ్ నిర్మించిన చిత్రం జై సింహ. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రేపు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. గత ఏడాది గౌతమీపుత్ర శాతకర్ణి , పైసా వసూల్ చిత్రాలతో అలరించిన బాలయ్య , ఈ ఏడాది జై సింహ గా రాబోతుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

ఇక ఈ మూవీ మొదటి షో హైదరాబాద్ లో ఉదయం 6 గంటల 30 నిమిషాలకు పడబోతోంది. కుకట్ పల్లి భ్రమరంభ మల్లికార్జున థియేటర్స్ లో ఈ సినిమా ప్రదర్శింపబడుతుంది. ఈ మూవీ లో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే సంక్రాంతి బరిలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రానికి నెగిటివ్ టాక్ రావడం తో ఈ సినిమా ఫై అందరిలో ఆసక్తి పెరిగింది. మరి బాలయ్య ఏం చేస్తాడో చూడాలి.