పాక్ అమ్మాయితో షమి..నిజమే

0టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమి అక్రమ సంబంధాల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. స్వయంగా అతని భార్య హసీన్‌ జహాన్‌ ఈ ఆరోపణలు చేస్తోంది. షమి మోసగాడని, పలువురు మహిళలతో సంబంధాలున్నాయని, ఒక మ్యాచ్‌ను ఫిక్స్‌ చేసేందుకు ఒక పాకిస్థాన్‌ అమ్మాయి ద్వారా షమి డబ్బు తీసుకున్నట్లు తెలిపిన హసీన్‌ కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

తాజాగా ఈ కేసులో షమీ దుబాయ్‌ లో రెండు రోజులు గడిపాడని బీసీసీఐ కోల్ కతా పోలీసులకు సమాచారమిచ్చింది. దీనిపై విచారణ ఆరంభించిన కోల్ కతా పోలీసులు, షమీ పర్యటన వివరాలు ఇవ్వలంటూ బీసీసీఐకి లేఖ రాశారు. దానికి స్పందించిన బీసీసీఐ, షమీ పర్యటన వివరాలు కోల్ కతా పోలీసులకు అందించింది.