స్ట్రాంగ్ టైటిల్ తో వస్తున్న బెల్లంకొండ హీరో

0

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్టార్ కాంబినేషన్ లతో.. భారీ బడ్జెట్ సినిమాలతో మాస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించాడు. ప్రస్తుతం శ్రీనివాస్ రెండు సినిమాల్లో ఒకేసారి నటిస్తున్నాడు. అందులో ఒకటి సీనియర్ ఫిలిం మేకర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రెండో సినిమాను శ్రీనివాస్ మామిళ్ళ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్నాడు.

తాజాగా శ్రీనివాస్ మామిళ్ళ తెరకెక్కించే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. #BSS5 గా పిలుచుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ఫిలిం మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ కాక మునుపే టైటిల్ బయటకు వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘కవచం’ అనే టైటిల్ ను లాక్ చేశారట. సహజంగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలన్నీ మాస్ ఎంటర్ టైనర్ జోనర్ లో తెరకెక్కేవే. ‘కవచం’ లాంటి పవర్ ఫుల్ టైటిల్ చూస్తుంటే ఈ సినిమా కూడా అదే కోవలో మాస్ ఎంటర్ టైనర్ గా ఉండే అవకాశం ఉంది.

ఏ సినిమాకైనా ప్రేక్షకుల్లోకి వెళ్ళేందుకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ముఖ్యం. ఇక ఆ టైటిల్ క్యాచీగా ఉండే వెంటనే ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా చూస్తే బెల్లంకొండ హీరో ‘కవచం’ టైటిల్ తో ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నట్టే. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఛోటా కె. నాయుడు ఈ సినిమాకు చాయాగ్రాహకుడు. ఈ సినిమాను వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ శొంటినేని నిర్మిస్తున్నాడు.
Please Read Disclaimer