యంగ్ హీరో ఖాతాలో ఇంకో రికార్డు

0సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొడితే గ్యారంటీగా శాటిలైట్ రైట్స్ కు డిమాండ్ పెరుగుతుంది. సహజంగానే అప్పుడు ఫ్యాన్సీ రేటు చెబుతుంటారు. కానీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్ రావడం రేర్ అనే చెప్పాలి. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ఈ విషయంలో లక్ వరించింది.

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ డైరెక్షన్ లో సాక్ష్యం మూవీ చేస్తున్నాడు. దీని తరవాత కొత్త దర్శకుడు శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్టయింది. ఈ సినిమా స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉంటుందని… ఆడియన్స్ ను కచ్చితంగా థ్రిల్ చేస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దాంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో బజ్ పెరిగింది. ఈ కారణంగా ఇప్పుడే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కు డిమాండ్ పెరిగిందట. దాదాపు రూ. 9.50 కోట్లకు పైగా చెల్లించి ఓ పెద్ద బ్యానర్ ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ అప్పుడే కొనేసిందని టాలీవుడ్ టాక్.

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు భారీ బడ్జెట్ తో తయారై రికార్డులు సృష్టిస్తుంటాయి. ఓ యంగ్ హీరో మూవీకి షూటింగ్ పూర్తికాకముందే శాటిలైట్ రైట్స్ రూపంలో ఇంత పెద్ద మొత్తం రావడం కూడా ఓ రకంగా రికార్డే. ఇది నిర్మాతకు కచ్చితంగా హ్యాపీనిస్తుంది. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ శొంఠినేని ఈ సినిమా నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.