సాక్ష్యం.. అసలు కథ ఇదేనట..

0షారుఖ్ ఖాన్ ‘రావన్’ చిత్రం గుర్తుందా.. వీడియో గేమ్ ల నుంచి ఉద్భవించిన రోబో అందరినీ చంపేస్తుండడం ఆ సినిమా కాన్సెప్ట్.. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో సినిమా వస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సాక్ష్యం’ మూవీలో కథ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది.

తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సోషియో ఫాంటసీకి సంబంధించిన కథగా తెలుస్తోంది. పంచభూతాల కథ అని కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇందులో వీడియో గేమ్ ల చుట్టే కథ తిరుగుతుందనే విషయం లీక్ అయ్యింది.

ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ వీడియో గేముల డెవలపర్ గా కనిపిస్తాడట.. తాను తయారు చేసిన గేమ్ లా ద్వారా.. శత్రువులు కూడా అంతమైపోతారట. అలా వీడియో గేములకు – విలన్లకు లింకు పెట్టి ఈ కథను అద్భుతంగా తీశాడట శ్రీవాస్. అయితే ఈ విషయంపై అధికారికంగా చిత్ర యూనిట్ స్పందించలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ వినూత్న చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి..