“భాగమతి” ప్రమోషనల్ వీడియో

0అనుష్క టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘భాగమతి’. జి.అశోక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ప్రమోషనల్‌ వీడియోను విడుదల చేసింది. ‘భాగమతి’ గెటప్‌లో భయపెట్టిన అనుష్క ఈ ఆంగ్ల పాటలో స్టైలిష్‌గా కన్పించారు. ప్రముఖ గాయని సుచిత్ర ఈ పాట పాడారు.

ఉన్ని ముకుందన్‌, జయరామ్, ఆశా శరత్‌, ప్రభాస్‌ శ్రీను, మురళీ శర్మ, విద్యులేఖ రామన్‌, ధన్‌రాజ్‌ తదితరులు‌ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమా గణతంత్ర దినోత్సవం నాడు విడుదల కాబోతోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌.ఎస్‌ తమన్‌ సంగీతం అందించారు.

ఈ సినిమా తరువాత అనుష్క ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కించబోయే ఓ చిత్రంలో నటించనున్నారు. ‘భాగమతి’ ప్రచార కార్యక్రమంలో అనుష్క ఈ విషయాన్ని వెల్లడించారు.