సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

ఘాటు లిప్పు లాకు లీకు వర్మ పనా?

0

రామ్ గోపాల్ వర్మ తన సినిమాలకు పైసా ఖర్చు కాకుండా పబ్లిసిటీ చేసుకోవడంలో సిద్దహస్తుడు. తెలుగులో వివాదం అనండి ఇంగ్లీష్ లో కాంట్రవర్సీ అనండి.. అలాంటివాటిని చిటికెలో సృష్టించి మీడియాను దాని చుట్టూ తిప్పుతూ మిగతా ఇంపార్టెంట్ విషయాలు అసలేవీ లేనట్టు భ్రమింపజేయడం అయన స్పెషాలిటీ. కానీ ఎంత కొత్త ఐడియాలైనా ఎంత డిఫరెంట్ ఫిలాసఫీ అయినా కొన్ని రోజులకు జనానికి మొహం మొత్తుతుంది. ఇప్పుడు వర్మ విషయంలో అలానే జరుగుతోంది.

రామ్ గోపాల్ వర్మ ‘భైరవగీత’ ను సమర్పిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అయన శిష్యుడు సిద్దార్థ్ తాతోలు దర్శకుడు. ఈ సినిమా ఎలా ఉండబోతోందనేది టీజర్.. ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు అర్థం అయింది. ఈ సినిమాను మొదట నవంబర్ 30 న రిలీజ్ కానుందని ప్రకటించారు. నవంబర్ 29 న రజనీ ‘2.0’ రిలీజ్ ఉండగా ఈ ‘భైరవగీత’ను 30 వ తేదీన రిలీజ్ చేయడం సాహసమే. రజనీ సినిమా అటూ ఇటూ అయితే సరే గానీ హిట్ టాక్ వస్తే ఆ సునామీని ఎవ్వరూ ఆపలేరు. అసలు ఆ సినిమాకు ఈ సినిమా పోటీనే కాదు. అయినా వర్మ ఇప్పటికే ‘2.0’ పిల్లల సినిమా అని ‘భైరవగీత’ పెద్దల సినిమా అని కామెంట్స్ చేసి అటెన్షన్ రాబట్టేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు ‘భైరవ గీత’ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 7 కు వాయిదా పడింది..

రిలీజ్ డేట్ విషయం ఇలా ఉంటే ‘భైరవగీత’ నుండి రీసెంట్ గా ఒక ఘాటు లిప్ లాక్ సీన్ లీకయింది. ఒక క్వారీలో హీరో ధనంజయ్ హీరోయిన్ ఇర్రా మోర్ ను తనవైపు లాక్కొని పెదవులకు ముద్దిచ్చే సన్నివేశమది. లిప్పు లాకు ఘాటే గానీ అది మాత్రం వైరల్ కాలేదు. వైరల్ కాకపోగా ఈ విషయం తెలిసిన నెటిజనులు ఈ లీక్ డ్రామా వెనక వర్మ ఉన్నాడని ఈ సినిమా కు హైప్ తెచ్చే ప్రయత్నాలలో ఈ లీకు ఒకటని కామెంట్ చేస్తున్నారు. సినిమాకు పెద్దగా క్రేజ్ రాకపోవడంతో ఇలాంటి అవుట్ డేటెడ్ ఐడియాస్ తో క్రేజ్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా కొంతమంది అంటున్నారు. ఇదంతా చూస్తుంటే వర్మ ఐడియాల మీద జనాలకు పెద్దగా ఇంట్రెస్ట్ లేన్నట్టుగా ఉంది.
Please Read Disclaimer