ట్రైలర్ టాక్: రా-రియలిస్టిక్ సీమ గీత

0రామ్ గోపాల్ వర్మ సినిమాలకంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుల సినిమాలకు ట్రేడ్ లో క్రేజ్ ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టే రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో ఆయన శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భైరవ గీత’. ఇప్పటికే ఈ సినిమా ప్రోమోస్ లో ఎలా ఉంటుందనేది తెలిపారు. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

విపరీతంగా కొట్టి చంపి వేలాడదీసిన ఒకరి శవాన్ని చూపిస్తూ స్టార్ట్ చేశారు రెండు నిముషాల కంటే తక్కువ నిడివి ఉన్న ఈ ట్రైలర్. ఆ వెంటనే “మనం సంపమంటే సంపనీకి మనకోసం సావనీకి కాకపొతే వాళ్ళ బొతుకులు యాదానికి అనుకుంటాండావు” అంటూ అచ్చమైన నాటు సీమ యాసలో ఒక పవర్ ఫుల్ డైలాగ్ వినిపిస్తుంది. ఇక సీన్లన్నీ రా గా రియలిస్టిక్ గా క్రూరంగా ఉన్నాయి. మేకప్ లేకుండా నటులు.. ఇక దానికి తగ్గట్టు న్యాచురల్ లోకేషన్స్ ఇవన్నీ చూస్తుంటే ఇది ‘రక్తచరిత్ర’ కు ఒక లవ్ స్టొరీ ముడిపెట్టి తీసిన క్రూర దృశ్యకావ్యం లా ఉంది.

రవి శంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ కు కరెక్ట్ గా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక ట్రైలర్ అంతా సీమ నేటివిటీ ని ప్రతిబింబించేలా ఉండడం- సీమ స్లాంగ్ వెంటనే ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తాయి. గాల్లోకి సుమోలు లేవడమే సీమ స్టైల్ అనే రొటీన్ మేకింగ్ కు భిన్నంగా అసలు ఒక్క ట్రైలర్ లో ఒక్క సుమో ను కూడా చూపించలేదు. ధనంజయ – ఇరా మోర్ లీడ్ యాక్టర్స్ గా నటించిన ఈ సినిమా మరో సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. మరి అంతలోపు ఈ సీమరక్తాన్ని మీరు చూడండి.